
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లి: నేడు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
►సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ప్రత్యేక కేబినెట్ సమావేశం
►కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై చర్చించనున్న కేబినెట్
►లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందించే సేవలపై చర్చించే అవకాశం
►బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ను ఆమోదించనున్న కేబినెట్
తూర్పుగోదావరి: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ రైతు బజార్లు
►జాయింట్ కలెక్టర్లకు మొబైల్ రైతుబజార్ల అనుమతులు మంజూరు చేసే అధికారం
►ప్రతిరోజు కూరగాయల ధరలను ప్రకటించనున్న జాయింట్ కలెక్టర్లు
తెలంగాణ:
హైదరాబాద్: తెలంగాణలో 45కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
►సికింద్రాబాద్ బౌద్దనగర్‌లో 45 ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ
►తెలంగాణలో నేటి నుంచి 12 కిలోల రేషన్ బియ్యం పంపిణీ
►87 లక్షల 59వేల రేషన్‌కార్డు లబ్ధిదారులకు అందించనున్న ప్రభుత్వం
►జనాలు గుమిగూడకుండా ఉదయం, సాయంత్రం బియ్యం పంపిణీ
అంతర్జాతీయం
►ప్రపంచవ్యాప్తంగా 5.29 లక్షల కరోనా పాజిటివ్ కేసులు
►కరోనాతో ఇప్పటివరకు 23,976 మంది మృతి
►ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న 1,23,380 మంది కరోనా రోగులు
ఇటలీ: ఇటలీలో 80,589 కేసులు, 8,215 మంది మృతి
►స్పెయిన్‌లో 57,786 కేసులు, 4,365 మంది మృతి
►చైనాలో తగ్గిన కరోనా మృతుల సంఖ్య
►చైనాలో 81,285 కరోనా పాజిటివ్ కేసులు, 3,287 మృతి
అమెరికా: అమెరికాలో విజృంభిస్తోన్న కరోనా
►అమెరికాలో 1,209కు చేరిన కరోనా మృతులు
►అమెరికాలో 83,672 కరోనా పాజిటివ్ కేసులు
Comments
Please login to add a commentAdd a comment