కొత్త రాష్ర్టం పునర్నిర్మాణానికి 25 డివూండ్లు
ప్రజా పోరాటంతోనే తెలంగాణ: పార్టీ అధికార ప్రతినిధి జగన్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సీపీఐ (మావోయిస్టు) పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆవిర్భవించింది. గతంలో ఈ ప్రాంతంలో ఉన్న ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీని రద్దుచేసి.. పది జిల్లాల పరిధిలో రాష్ట్ర కమిటీని విస్తరించింది. పార్టీ నిర్మాణంతో పాటు ప్రజాస్వామిక తెలంగాణ సాధనకు పోరాడుతామని పిలుపునిచ్చింది. తాజా రాజకీయు పరిణావూలపై స్పందనను, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎజెండాను ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట సోమవారం డిమాండ్ల రూపంలో 25అంశాలను ప్రస్తావిస్తూ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అందులో ముఖ్యాంశాలు..
ప్రజల సుదీర్ఘ పోరాటం.. అవురుల త్యాగాల ఫలితంతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తమ మద్దతువల్లే రాష్ట్రం ఏర్పడిందని చెప్పుకుంటున్న బీజేపీది పచ్చి అబద్ధం. అద్వానీ, వెంకయ్యనాయుుడు తెలంగాణను అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు చేశారు.
ఇచ్చింది మేమేనని కాంగ్రెస్, తవు పోరాటంవల్లే వచ్చిందని టీఆర్‌ఎస్, తవు వుద్దతే కీలకవుని బీజేపీ ఈ విజయూన్ని ఎవరికి వారు ఆపాదించుకోవటానికి పోటీపడుతున్నాయి. పార్టీల మెడలు వంచిన ఘనత వుువ్మూటికి తెలంగాణ ప్రజలదే.
సోనియూ ఆడిన డ్రామాయే తెలంగాణ రాష్ట్రం ఆలస్యానికి, ఇంతవుంది ఆత్మహత్యలకు కారణమైంది.
ఉవ్ముడి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, ఉమ్మడి హైకోర్టు, కృష్ణా గోదావరి జలాల నిర్వహణకు అపెక్స్ కౌన్సిల్, గోదావరి-కృష్ణా నది నిర్వహణ మండలిని ఏర్పాటుచేయుటం, జనాభా ప్రాతిపదికపై ఆస్తులు, అప్పుల పంపిణీ, పింఛన్ల చెల్లింపులు, పదేళ్ల పాటు యథాతథంగా ఉన్నత విద్య అడ్మిషన్ల కోటా.. వీటితో తెలంగాణ ప్రజలు అన్యాయమవుతారు.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయు హోదా కల్పించటం కుట్ర. అందుకే ఆంక్షలు లేని ప్రజాస్వావ్యు తెలంగాణ కోసం పోరాడాల్సిన అవసరముంది. మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంస్థలపై నిషేధాన్ని ఎత్తివేయూలి.
తెలంగాణలో మావోల కొత్త కమిటీ
Published Tue, Feb 25 2014 12:21 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement