ఢిల్లీలో వివాహిత అనుమానాస్పద మృతి | Married suspicious death in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో వివాహిత అనుమానాస్పద మృతి

Published Sat, Oct 19 2013 3:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

Married suspicious death in Delhi

చిత్తూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ఢిల్లీలోని మిలటరీ క్వార్టర్స్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జిల్లావాసి సౌజన్య మృతదేహం  శుక్రవారం చిత్తూరు నగరానికి చేరుకుంది. వారి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. చిత్తూరుకు చెందిన కిషోర్ మిలటరీ జవాన్‌గా ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నాడు.

ఇతనికి గుడియాత్తంకు చెందిన సెల్వరాణి, జయపాల్ దంపతుల కుమార్తె సౌజన్యతో 2012 ఫిబ్రవరి 23న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరు నార్త్‌ఢిల్లీలోని సరోజినీనగర్‌లో ఉన్న మిలటరీ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 15న సౌజన్య మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులకు అక్కడి పోలీసులు సమాచారం అందించారు. వీరు అక్కడకు చేరుకునేలోపు కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వారు ఢిల్లీ నుంచి మృతదేహాన్ని తీసుకొని చిత్తూరులోని స్వామిమేస్త్రీ వీధిలోని కిషోర్ ఇంటికి శుక్రవారం వచ్చారు. అయితే తమ అల్లుడు కిషోర్‌పై తమకు ఎలాంటి అనుమానం లేదని, అనవసరంగా ఢిల్లీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

పోల్

Advertisement