ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి వచ్చిన వారుగానీ, వారి బంధువులుగానీ హోమ్ ఐసొలేషన్ (ఇంట్లోనే వైద్య పరిశీలన)లో లేకుంటే వారిని బలవంతంగా ఆస్పత్రికి తీసుకొచ్చి పరిశీలనలో ఉంచే అధికారం పోలీసులకు ఉంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కేఎస్ జవహర్‌రెడ్డి శనివారం పాత చట్టాన్ని సవరిస్తూ ఉత్తర్వులిచ్చారు. 14 రోజుల పాటు ఇంట్లో ఉండేందుకు నిరాకరిస్తే వారిని ఆస్పత్రికి బలవంతంగా చేరుస్తామని, అలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో (స్టేషన్ హౌస్ ఆఫీసర్)కు ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి సాంకేతిక బృందం ఏర్పాటు
కరోనా అనుమానిత లక్షణాలున్న వారి సంఖ్య విపరీతంగా పెరగడం వంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేసి, చర్యలు తీసుకునేందుకు టెక్నికల్ కమిటీని వేశారు. ఇందులో ఆరుగురు సభ్యులుంటారు. వీళ్లందరూ ఎప్పటికప్పుడు కరోనా వైరస్‌కు సంబంధించిన మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్‌పై వివరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment