సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు పరిశీలన జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం వైద్య విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. రెండు మాసాల్లోగా ఈ రెం డు ప్రాంతాల్లో కళాశాలలకు సంబంధించిన నివేదికను అధికారులు ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. మహబూబ్‌నగర్, ఏలూరుల్లో ప్రస్తుతం జిల్లా ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రుల వైశాల్యం, అక్కడ కొత్త కళాశాల ఏర్పాటుకు అనువైన పరిస్థితులపై వైద్యవిద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఇప్పటికే భూమి సేకరణపై నివేదిక పంపినట్టు సమాచారం.
వచ్చే ఏడాది నెల్లూరు, పద్మావతి వైద్య కళాశాలలు అనుమానమే
నెల్లూరులో రూ.310 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలు వచ్చే ఏడాది ప్రారంభించడం అనుమానంగా ఉంది. ఇప్పటివరకూ 50 శాతం నిర్మాణం కూడా పూర్తి కాలేదు. అలాగే, తిరుపతిలో పద్మావతి వైద్య కళాశాల నిర్మాణ పనులు ఇంకా మొదలే కాలేదు.
ఏలూరు, పాలమూరులో వైద్య కళాశాలలు!
Published Sat, Dec 21 2013 1:42 AM | Last Updated on Tue, Oct 9 2018 6:57 PM
Advertisement