
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర్రంలో మూడు నెలల్లోనే లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉండటం గర్వంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడం పట్ల కొంతమంది ఓర్వలేక సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలపై దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా.. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. సచివాలయ, వార్డు ఉద్యోగులు నిజాయతీగా బాధ్యతలు నిర్వర్తించి ప్రజలకు సేవాలందించాలని కోరారు. చంద్రబాబు.. నిరుద్యోగులను పట్టించుకోకుండా కేవలం తన కుమారుడికి మాత్రమే ఉద్యోగం ఇచ్చుకున్నారని.. వైఎస్ జగన్ మాత్రం నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment