జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్ : ప్రయివేట్ విద్య వ్యాపార మాఫియాపై సమరం చేస్తామని తెలంగాణ విద్యార్థి జాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్నూర్ రవి అన్నారు. బుధవారం స్థానిక తెలంగాణచౌరస్తాలో ప్రయివేట్ విద్య మాఫియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రయివేట్ విద్య యాజమాన్యాలు ఓ మాఫియాగా తయారయ్యాయని ఆరోపించారు. ఫీజుల పేరుతో దోపిడీ కొనసాగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా కొన్ని విద్యా సంస్థలు నడుస్తున్నాయన్నారు. వాటిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటం చేస్తున్న విద్యార్థి నాయకులపై పాఠశాలల యాజమాన్యాలు కేసులు పెట్టిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు భరత్‌చంద్ర, సందీప్, శరత్, మనివర్ధన్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రయివేట్ విద్య మాఫియాపై సమరం
Published Thu, Jan 9 2014 6:23 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM
Advertisement
Advertisement