చీఫ్ ప్లానింగ్ అధికారిపై ఎంపీ వైవీ ఆగ్రహం
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు చీఫ్ ప్లానింగ్ అధికారి అనుసరిస్తున్న వైఖరిపై స్థానిక ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాటలు విని... సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం సమీక్ష సమావేశాన్ని వాయిదా వేశారంటూ చీఫ్ ప్లానింగ్ అధికారిపై మండిపడ్డారు.
మీ వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సమీక్ష సమావేశాన్ని వాయిదా వేసి ప్రధాని కార్యక్రమాన్ని జిల్లా అధికారులు, మంత్రి అవమానించారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.