ongole mp
-
'ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది'
ఒంగోలు : ప్రకాశం జిల్లాలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బలంగానే ఉన్నామని ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సదరు నియోజకవర్గాలు ప్రజల అండతో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. శనివారం ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీ మారిన నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఉత్తరాఖండ్ తరహాలో ఫిరాయింపుదారులపై వేటు తప్పదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
ఫలించిన ఒంగోలు ఎంపీ వైవీ కృషి
ఒంగోలు జాతి పశుసంపద పరిరక్షణకు బ్రెజిల్ సంసిద్ధత ఒంగోలు టూటౌన్: ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. పశుసంపద వృద్ధికి ఎంతోకాలంగా బ్రెజిల్ అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి ఇచ్చేందుకు ఆ దేశం అంగీకరించింది. అందులో భాగంగా బ్రెజిల్లో ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు జరిగే ‘ఎపోజెబ్ ఎక్స్పో’కు హాజరవ్వాలంటూ ఎంపీ వైవీకి ఆహ్వానమందింది. ఆహ్వాన పత్రికను బ్రెజిల్ దేశ ప్రతినిధి డాక్టర్ జోస్ ఓటాలియా లెవ్రోస్ గురువారం హైదరాబాద్‌లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో కలసి అందజేశారు. ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి బ్రెజిల్ శాస్త్రవేత్తలు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి అందించాలని గతేడాది నవంబర్ 14న ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రిని న్యూఢిల్లీలో కలసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ‘ఎపోజెబ్ ఎక్స్పో’కు హాజరవ్వాలని ఎంపీ వైవీకి బ్రెజిల్ ఆహ్వానం పంపింది. పశుసంపద అభివృద్ధికి బ్రెజిల్ వినియోగించే శాస్త్ర సాంకేతిక పరికరాల్ని ఎక్స్‌పోలో ప్రదర్శిస్తారు. ఈ ఎక్స్‌పోలోనే భారత ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకునేందుకు బ్రెజిల్ సిద్ధంగా ఉందని ఎంపీ తెలిపారు. ఎక్స్‌పోకు కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావును కూడా ఆహ్వానించారన్నారు. -
'నిల్వ ఉన్న పొగాకును తక్షణమే కొనుగోలు చేయాలి'
హైదరాబాద్: రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలను తక్షణమే కొనుగోలు చేయాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పొగాకు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఈ ఏడాదిలోనే నలుగురు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పొగాకు రైతులు అప్పులబారిన పడకుండా ఆదుకున్నారని గుర్తుచేశారు. పొగాకు రైతుల సమస్యలపై చాలాసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా.. చోద్యం చూస్తున్నాయి తప్ప సమస్యను పరిష్కరిచండం లేదని దుయ్యబట్టారు. టొబాకో బోర్డు చైర్మన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలను తక్షణమే కొనుగోలు చేసి.. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. -
విధులను, నిధులను కాలరాస్తున్నారు!
-
'దేశం గొప్ప దార్శనికుడిని కోల్పోయింది'
ఒంగోలు : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణం దేశానికి తీరని లోటని ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అబ్దుల్ కలాంకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడతూ... అబ్దుల్ కలాం మృతితో దేశం గొప్ప దార్శనికుడు, మహానీయుడిని కోల్పోయిందన్నారు. కలాం మరణించినా ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయన సజీవంగా ఉంటారన్నారు. -
ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ నిరసన
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార టీడీపీ అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒంగోలులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఒంగోలు ఎంపీ వై వి సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షడు ఎం. అశోక్‌రెడ్డితోపాటు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
'వేసవిలో దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తా'
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో తాగునీరు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. అందులోభాగంగా వేసవిలో దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ప్రభుత్వం, ఉన్నతాధికారులపైనా ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. శుక్రవారం జిల్లాలోని పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెంలో ఆర్వో వాటర్ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. -
చీఫ్ ప్లానింగ్ అధికారిపై ఎంపీ వైవీ ఆగ్రహం
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు చీఫ్ ప్లానింగ్ అధికారి అనుసరిస్తున్న వైఖరిపై స్థానిక ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాటలు విని... సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం సమీక్ష సమావేశాన్ని వాయిదా వేశారంటూ చీఫ్ ప్లానింగ్ అధికారిపై మండిపడ్డారు. మీ వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సమీక్ష సమావేశాన్ని వాయిదా వేసి ప్రధాని కార్యక్రమాన్ని జిల్లా అధికారులు, మంత్రి అవమానించారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. -
మేం బాధ్యతగా స్పందిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై అధికారపార్టీ నిద్రమత్తులో ఉన్నా.. బాధ్యతగల ప్రతిపక్షంగా కేంద్రంపై వైఎస్ఆర్సీపీ ఒత్తిడి తెస్తూనే ఉందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిసి విన్నవించామని తెలిపారు. వచ్చే బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు రూ. 250 కోట్ల నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్, లిఫ్టు ఏర్పాటుచేయాలని కేంద్రమంత్రి సురేష్ ప్రభును కోరగా ఆయన వెంటనే స్పందించారన్నారు. అబద్ధాలు, మాయమాటలతో మభ్యపెడుతున్న టీడీపీ ప్రభుత్వంపై భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. -
ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఘన సన్మానం
సూళ్లూరుపేట: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని సూళ్లూరుపేట వైఎస్సార్సీపీ నాయకుడు దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లు బుధవారం ఘనంగా సన్మానించారు. ఆయన ఒంగోలు నుంచి చెన్నై వెళుతుండగా సూళ్లూరుపేట హోలీక్రాస్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై ఆపి శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. దబ్బల రాజారెడ్డి ఆయనతో మాట్లాడుతూ సూళ్లూరుపేటలో పార్టీ పరిస్థితి బాగుందని, మున్సిపాలిటీలో 10 వార్డులు గెలుచుకున్నామని చెప్పారు. మండలంలో 9 ఎంపీటీసీలకు 6 స్థానాలు గెలుచుకున్నామని తెలిపారు. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటామని చెప్పారు. చైర్పర్సన్ అభ్యర్థి ముత్తుకూరు లక్ష్మమ్మతో పాటు 9 మంది వార్డు సభ్యులు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కార్యకర్తలు అండగా ఉండాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రుణమాఫీపై ప్రభుత్వం చెప్పే మాటల్లో నిజం లేదు కాబట్టి ప్రతిపక్షంగా మనం ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి ప్రజలకు మేలు చేకూరేలా పనిచేయాలన్నారు. పార్టీ నాయకులు నలుబోయిన రాజసులోచనమ్మ, కళత్తూరు శేఖర్‌రెడ్డి, గండవరం సురేష్‌రెడ్డి, గోగుల తిరుపాలు, వెంకటసుబ్బయ్యశెట్టి, కౌన్సిలర్లు పాల మురళి, కలిశెట్టి బాబు, గునిశెట్టి చిరంజీవి, తొప్పాని సుశీలమ్మ, వాయలూరు సరసమ్మ, ముంగర శేషారెడ్డి, పేర్నాటి దశయ్య, ఉమ్మిటి జానకీరామ్, నలుబోయిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద అలవలపాడు ఘటనపై ఒంగోలు ఎంపీ సీరియస్
ప్రకాశం జిల్లా పెద్ద అలవలపాడులో టీడీపీ నేతల దాడిలో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సింగయ్య మృతిపై ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై వి సుబ్బారెడ్డి శుక్రవారం ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అదే విషయంపై జిల్లా ఎస్పీతో సుబ్బారెడ్డి ఫోన్లో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన ఎస్పీని కోరారు. పెద్ద అలవలపాడులో రేషన్ షాపు డీలర్ అంశంపై అటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. ఆ దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా సింగయ్య అనే కార్యకర్త మృతి చెందాడు. మిగిలిన ముగ్గురి పరిస్థితి ఆందోళనగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ఆర్ సీపీ నేత కత్తుల బ్రహ్మానందారెడ్డి శుక్రవారం పరామర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలిని ఆయన డిమాండ్ చేశారు. -
నీటి సమస్యను పరిష్కరిస్తాం
- వైఎస్సార్ సీపీ నేతలంతా జగన్‌తోనే.. - టీడీపీ ప్రలోభాలకు ఎవరూ తలొగ్గరు - పజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం - ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో తాగు, సాగునీటి సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వై .వి.సుబ్బారెడ్డి చెప్పారు. తన కార్యాలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజులతో కలసి గురువారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో వైఎస్సార్ సీపీకి ఆరు శాసనసభ స్థానాలు, ఒక ఎంపీ స్థానం కట్టబెట్టిన ప్రజలకు వై.వి. కృతజ్ఞతలు తెలిపారు. - జిల్లా వ్యాప్తంగా నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తనతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ విజయకుమార్, సంబంధిత అధికారులను కలసి వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. అవసరమైతే ఈ 20 రోజులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటాం. - వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను తమ వైపునకు తిప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ నేతలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. - ఇడుపులపాయలో బుధవారం నిర్వహించిన పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి దివంగత భూమా శోభానాగిరెడ్డి, అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడాలి నాని తప్ప, మిగిలిన శాసనసభ్యులంతా హాజరయ్యారని చెప్పారు. - చంద్రబాబు బూటకపు వాగ్దానాలు, అమలు కానీ హామీలను ప్రజలు నమ్మారని, మోడీ గాలి కొంత రాష్ట్రంపై కూడా ప్రభావం చూపిందని, దీనివల్లే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాలేకపోయిందని విశ్లేషించారు. - ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడతామని ఎంపీ వివరించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రమణారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
కార్యకర్తలపై దాడులను ఖండిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులను ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో కొత్త ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారని సుబ్బారెడ్డి అన్నారు. దీనిపై చిలవలు పలవలుగా లేనిపోని కథలు సృష్టించడం సరికాదని చెప్పారు.