వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులను ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులను ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో కొత్త ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారని సుబ్బారెడ్డి అన్నారు. దీనిపై చిలవలు పలవలుగా లేనిపోని కథలు సృష్టించడం సరికాదని చెప్పారు.