ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార టీడీపీ అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒంగోలులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఒంగోలు ఎంపీ వై వి సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షడు ఎం. అశోక్రెడ్డితోపాటు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.