
'దేశం గొప్ప దార్శనికుడిని కోల్పోయింది'
ఒంగోలు : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణం దేశానికి తీరని లోటని ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అబ్దుల్ కలాంకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడతూ... అబ్దుల్ కలాం మృతితో దేశం గొప్ప దార్శనికుడు, మహానీయుడిని కోల్పోయిందన్నారు. కలాం మరణించినా ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయన సజీవంగా ఉంటారన్నారు.