
'ఇరుప్రాంతాల్లో చంద్రబాబు అడ్రస్ గల్లంతే'
ఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు తెలంగాణ, సీమాంధ్ర ఇరుప్రాంతాల్లో అడ్రస్ గల్లంతేనని నాగం జనార్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లును పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ వెంటనే మద్దతిస్తుందని నాగం అన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కొన్ని సవరణలుపై తమ జాతీయ నాయకత్వానికి ఇచ్చామన్నారు. బీజేపీ తెలంగాణకు కట్టుబడి ఉందని నాగం జనార్థన్ రెడ్డి తెలిపారు.