
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహాణ శాఖ కమిషనర్ సూచించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ.. వంశధార-నాగావళి నదులకు వరద నీటి ఉధృతి పెరుగుతోందని, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ముందస్తు చర‍్యగా ప్రత్యేక బృందాలను తరలిస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లాలోని ప్రభావిత ప్రాంతాలకు ఒక ఎస్డీఆర్‌ఎఫ్, రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రానున్నాయని పేర్కొన్నారు. గొట్టా బ్యారేజ్, తోటపల్లి వద్ద వరద ప్రభావం తీవ్రరూపం దాల్చడంతో గొట్ట బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 64,294 క్యూసెక్కులు ఉండగా దగ్గర ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. తోటపల్లి వద్ద ఇన్ ఫ్లో 48,750, అవుట్ ఫ్లో 55,511 క్యూసెక్కులు ఉండగా రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment