
ఆలయ ఉత్సవాల్లో అసభ్య నృత్యాలు
నెల్లూరు: నెల్లూరు జిల్లా జోన్నవాడలో నెలవైన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ ఆలయం ప్రముఖమైనది. ఈ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకులు, యాంకర్లతో పాటకచేరిని ఏర్పాటుచేశారు.
ఈ పాట కచేరిలో ఆలయ కమిటీ సభ్యుడు సింగారెడ్డి నరసారెడ్డి మందేసి చిందులు వేశాడు. మాస్ పాటలకు యాంకర్లతో కలిసి ఆయన వేదికపై చిందులు వేయడం జనానికి ఆగ్రహం తెప్పించింది. ఆలయ ఉత్సవమన్న సభ్యత మరిచి ఆయన మద్యం మత్తులో చిందులు వేశారని, నరసారెడ్డి కాస్తా సరసారెడ్డిగా ప్రవర్తించారని జనం చివాట్లు పెట్టారు.