teppostavam
-
దుర్గాఘాట్‌లో మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తుల తెప్పోత్సవం
విజయవాడ: గంగాపార్వతీ సమేత మిమల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తుల తెప్పోత్సవంలో భాగంగా స్వామి దుర్గాఘాట్‌లోని కృష్ణానదిలో హంసవాహనం జలవిహారం చేస్తున్నారు. మూడు మార్లు ఉత్సవవిగ్రహాలకు జలవిహారం చేయించనున్నారు. దుర్గాఘాట్ నుంచి ప్రారంభమైన తెప్పోత్సవాన్ని చూడటానికి భక్తులు విశేషంగా హాజరయ్యారు. హంసవాహనం పైనకేవలం 31 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల మధ్య తెప్పోత్సవం జరుగుతోంది. మూడేళ్ల తర్వాత భక్తులకు స్వామివారు నదీవిహారం చూసే భాగ్యాన్ని కల్పించారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో బాణా సంచా సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుర్గాఘాట్‌తో పాటు ప్రకాశం బ్యారేజ్ నుంచి తెప్పోత్సవాన్నిభక్తులు వీక్షించారు. -
వర్షం కారణంగా తెప్పోత్సవం రద్దు
-
నిరాడంబరంగా తెప్పోత్సవం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించే తెప్పోత్సవాన్ని బుధవారం నిరాడంబరంగా ఆంతరంగికంగానే జరిపించారు. స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీ సేవగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా హంసవాహనంతో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి వారిని వేంచేపు చేశారు. గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర తీర్థంతో సంప్రోక్షణ చేసిన తర్వాత ప్రత్యేక పూజలు, ఆరాధన, ఏకాంత తిరుమంజనం, నివేదన, దర్బారు సేవలను జరిపించారు. ఇక గురువారం తెల్లవారుజామున నిర్వహించే ఉత్తర ద్వార దర్శనాన్ని సైతం నిరాడంబరంగానే జరపనున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా విద్యుత్ లైట్ల అలంకరణలో భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం -
నదిలో విహారం లేకుండానే తెప్పోత్సవం
సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో దుర్గమ్మ నది విహారానికి అధికారులు అనుమతి నిరాకరించారు. ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఈ ఏడాది తెప్పోత్సవానికి ఆటంకం ఏర్పడింది. ఫ్రంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని కో ఆర్డినేషన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఇతర అధికార యంత్రంగం కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలలో చివరి రోజు (ఆదివారం) ఆది దంపతులు కృష్ణానదిలో విహరించడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం, ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో తెప్పోత్సవం నిర్వహణపై జిల్లా కలెక్టర్‌తో దేవస్థాన అధికారులు చర్చించి, తెప్పోత్సవంపై తుది నిర్ణయం తీసుకున్నారు. కాగా ఉత్సవ మూర్తులను హంస వాహనంపై ఉంచి మూడుసార్లు వాహనాన్ని ముందుకు వెనక్కు తిప్పుతారు. దీంతో నదీ విహారం పూర్తయినట్లే.. గతంలో 2004లో ఇదే తరహాలో తెప్పోత్సవాన్ని నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఇంజినీర్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున స్వల్ప మార్పులతో తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయం జరిగింది. నదిలో విహారం లేకుండా దుర్గా మళ్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహిస్తాం. తెప్పోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం కృష్ణా నదిలో దుర్గా మళ్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు యథాతథంగా పూజలు జరుపుతాం. పరిమిత సంఖ్యలో అర్చకులతో నదిలో ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తాం. తెప్పోత్సవం జరుగుతున్నంత సేపు కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌పై వాహనాలు, భక్తులు రాకపోకలు ఆపేస్తాం.’ అని తెలిపారు. (చదవండి: ‘సీఎం జగన్ స్పందన అభినందనీయం’) సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సే ముఖ్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కోవిడ్ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. నవంబర్, డిసెంబర్లో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందన్నారు. దసరా తర్వాత సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
ఆలయ ఉత్సవాల్లో అసభ్య నృత్యాలు
నెల్లూరు: నెల్లూరు జిల్లా జోన్నవాడలో నెలవైన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ ఆలయం ప్రముఖమైనది. ఈ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకులు, యాంకర్లతో పాటకచేరిని ఏర్పాటుచేశారు. ఈ పాట కచేరిలో ఆలయ కమిటీ సభ్యుడు సింగారెడ్డి నరసారెడ్డి మందేసి చిందులు వేశాడు. మాస్ పాటలకు యాంకర్లతో కలిసి ఆయన వేదికపై చిందులు వేయడం జనానికి ఆగ్రహం తెప్పించింది. ఆలయ ఉత్సవమన్న సభ్యత మరిచి ఆయన మద్యం మత్తులో చిందులు వేశారని, నరసారెడ్డి కాస్తా సరసారెడ్డిగా ప్రవర్తించారని జనం చివాట్లు పెట్టారు. -
నేడు వరసిద్ధుడి తెప్పోత్సవం
కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక ప్రత్యేకోత్సవాల్లో భాగంగా ఆదివారం తెప్పోత్సవం జరగనున్నది. ఇందులో భాగంగా రాత్రి సిద్ధి బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పలపై (పల్లకిపై) ఆలయ పుష్కరణిలో విహరించనున్నారు. ఉత్సవ ఉభయదారులు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి లడ్డూ వేలం బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైన తెప్పోత్సవం అనంతరం స్వామి వారికి ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసేవారు. 21 కిలోల బరువుగల లడ్డూ ప్రసాదాన్ని మూల విగ్రహం వద్ద 21 రోజుల పాటూ ఉంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదివారం రాత్రి ఉత్సవాల అనంతరం ఆలయ ఆస్థాన మండపంలో వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పీ పూర్ణచంద్రరావు తెలిపారు. తెప్పోత్సవానికి విస్తృత ఏర్పాట్లు వినాయకస్వామి వారి ఆలయంలో ఆదివారం నిర్వహించే ప్రత్యేకోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున జరుగుతున్న తెప్పోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ ఈఓ పి.పూర్ణచంద్రరావు శనివారం తెలిపారు. ఆలయ కార్యాలయ భవనంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేకోత్సవాల్లో ఆఖరి రోజున ఆదివారం రాత్రి స్వామివారికి వైభవంగా వాహన సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ పుష్కరిణిలో నిర్వహించనున్న ఈ ఉత్సవం కోసం పుష్కరిణిని శుద్ధి చేసి నీటిని నింపినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్తూరు సీఐ ఆదినారాయణ, కాణిపాకం ఎస్ఐ నరేష్‌బాబు మాట్లాడుతూ ఉత్సవ కార్యక్రమాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.