ఆర్టీసీకి జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారం | National Merit Award to RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారం

Published Mon, Aug 14 2017 1:19 AM | Last Updated on Tue, Sep 12 2017 12:00 AM

National Merit Award to RTC

ఏఎస్‌ఆర్‌టీయూ నుంచి అవార్డు అందుకున్న ఎండీ మాలకొండయ్య 
 
సాక్షి, అమరావతి: ఆర్టీసీకి జాతీయ స్థాయి రవాణా ప్రతిభ పురస్కారం దక్కింది. ప్రజా రవాణా వ్యవస్థలో నూతన ఆవిష్కరణలు అనే అంశంపై ఆల్‌ ఇండియా స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. ఈనెల 10, 11 తేదీల్లో ఢిల్లీలోని మాణిక్‌ షా సెంటర్‌లో జరిగిన సదస్సులో వాహన తయారీదారులు, వాహన విడి భాగాల తయారీ దారులు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ రవాణా రంగంలో వివిధ అంశాలపై నివేదికలు సమర్పించారు.

‘టెస్ట్‌ బ్రాండింగ్‌’, మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో నూతన అల్ట్రా డీలక్స్‌ బ్రాండ్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ ప్రవేశపెట్టినందుకుగాను ఈ పురస్కారం దక్కింది. పురస్కారం కింద ట్రోఫీ, ప్రశంసా పత్రం, రూ.2.50 లక్షల నగదు బహుమతి, ఏపీఎస్‌ఆర్టీసీకి దక్కాయి. అవార్డును ఎండీ మాలకొండయ్య, డిప్యూటీ ఛీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్లు నాగేశ్వరరావు, శ్రీనివాసరావులు 
అందుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement