సాక్షి, అమరావతి: డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేలా ఏపీ పోలీస్ యాక్ట్‌ను సవరిస్తూ చంద్రబాబు సర్కార్ మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. డీజీపీ పోస్టు కోసం రాష్ట్రానికి చెందిన ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను పంపించగా.. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ యూపీఎస్సీ పలుమార్లు తిప్పి పంపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో డీజీపీ ఎంపిక వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి సంబం«ధం లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఈ నెల 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్(రిఫామ్స్, అడ్మినిస్ట్రేటివ్) ఆర్డినెన్స్ నంబర్ 4–2017ను జారీ చేశారు. దీనికి ఈ నెల 25న గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.
రేసులో మాలకొండయ్య, ఠాకూర్, సవాంగ్..
ప్రస్తుత డీజీపీ నండూరి సాంబశివరావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో 2018 జనవరి 1 నుంచి కొత్త డీజీపీకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. సాంబశివరావు తర్వాత ప్యానల్‌లో మాలకొండయ్య, వీఎస్‌కే కౌముది, వినయ్ రంజన్‌రే, ఆర్పీ ఠాకూర్, గౌతమ్ సవాంగ్‌లున్నారు. వీరిలో మాలకొండయ్య, ఠాకూర్, సవాంగ్‌ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment