DGP selection
-
‘డీజీపీ నియామకాలపై యూపీఎస్సీని ఆశ్రయించాల్సిందే’
సాక్షి, న్యూఢిల్లీ : డీజీపీ ఎంపిక, నియామకాలపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని ఐదు రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. డీజీపీల ఎంపిక, నియామకాలపై తమ స్ధానిక చట్టాలకు అనుగుణంగా వ్యవహరించే వెసులుబాటు కోరుతూ పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్, హర్యానా, బిహార్ తదితర రాష్ట్రాల అప్పీల్‌ను విచారిస్తూ సుప్రీం కోర్టు గతంలో న్యాయస్ధానం జారీ చేసిన ఉత్తర్వులను సమర్ధించింది. డీజీపీ నియామకానికి రాష్ట్రాలు యూపీఎస్సీని ఆశ్రయించాల్సిందేనని స్పష్టం చేసింది.డీజీపీల ఎంపిక, నియామకంపై విస్తృత ప్రయోజనాలతో పాటు రాజకీయ జోక్యం నుంచి పోలీస్ అధికారులను కాపాడేందుకు కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. డీజీపీల నియామకానికి అనుసరించాల్సిన ప్రక్రియపై గత ఏడాది జులై 3న సుప్రీం కోర్టు పలు ఆదేశాలను జారీ చేసింది. -
ఇక డీజీపీ నియామకం రాష్ట్రం ఇష్టమే..
సాక్షి, అమరావతి: డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేలా ఏపీ పోలీస్ యాక్ట్‌ను సవరిస్తూ చంద్రబాబు సర్కార్ మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. డీజీపీ పోస్టు కోసం రాష్ట్రానికి చెందిన ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను పంపించగా.. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ యూపీఎస్సీ పలుమార్లు తిప్పి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ ఎంపిక వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి సంబం«ధం లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఈ నెల 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్(రిఫామ్స్, అడ్మినిస్ట్రేటివ్) ఆర్డినెన్స్ నంబర్ 4–2017ను జారీ చేశారు. దీనికి ఈ నెల 25న గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. రేసులో మాలకొండయ్య, ఠాకూర్, సవాంగ్.. ప్రస్తుత డీజీపీ నండూరి సాంబశివరావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో 2018 జనవరి 1 నుంచి కొత్త డీజీపీకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. సాంబశివరావు తర్వాత ప్యానల్లో మాలకొండయ్య, వీఎస్కే కౌముది, వినయ్ రంజన్రే, ఆర్పీ ఠాకూర్, గౌతమ్ సవాంగ్లున్నారు. వీరిలో మాలకొండయ్య, ఠాకూర్, సవాంగ్‌ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. -
పోలీస్ బాస్... మళ్లీ రేస్!
-
పోలీస్ బాస్... మళ్లీ రేస్!
సాక్షి, అమరావతి: నూతన డీజీపీ ఎంపికపై తానొకటి తలిస్తే కేంద్రం మరోలా నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఏడుగురు సీనియర్ ఐపీఎస్‌ల పేర్లతో యూపీఎస్సీకి పంపిన ప్యానల్లో లోపాలు ఉన్నాయంటూ కేంద్రం తిప్పి పంపిన సంగతి తెలిసిందే. దీంతో శాశ్వత డీజీపీ ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. పోలీస్ బాస్ పోస్టు కోసం సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో మళ్లీ రేస్ మొదలైంది. ప్రస్తుత ఇన్చార్జి డీజీపీ నండూరి సాంబశివరావును మరో రెండేళ్లు కొనసాగించాలని సీఎం భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే, సాంబశివరావుకు చెక్ పెట్టేందుకు కేంద్రం స్థాయిలో చక్రం తిప్పింది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఐపీఎస్ ప్యానల్‌ను 6 నెలల ముందుగానే యూపీఎస్సీకి పంపాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది. గత నెలలో కేంద్రానికి పంపిన ఏడుగురి పేర్ల జాబితాలో ఉన్న సాంబశివరావు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. సీనియారిటీ ప్యానల్లో ఉన్న మాలకొండయ్య, రమణమూర్తిల పదవీ కాలం ఏడాదిలోపే ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఏడాదిలోపే పదవి విరమణ చేయనున్న ఆ ముగ్గురిని మినహాయించి కొత్త జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. పాత జాబితాలో ఉన్న ముగ్గురిని తొలగిస్తే కౌముది, ఆర్పీ ఠాకూర్, గౌతమ్ సవాంగ్, వినయ్ రంజన్రే మిగిలారు. ఈ నేపథ్యంలో కేంద్రం తిప్పి పంపిన జాబితాలో అర్హత కలిగిన నలుగురికి తోడు మరో ముగ్గురు ఏడీజీలకు డీజీపీలుగా పదోన్నతులు కల్పించి ఆ ఏడుగురి పేర్లను కేంద్రానికి పంపించాలా? లేక పాత జాబితానే మళ్లీ పంపాలా? అనేదానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. జేవీ రాముడు అలా.. సాంబశివరావు ఇలా.. గతంలో కేవలం రెండు నెలల పదవీ కాలం మిగిలిన ఉన్న జేవీ రాముడికి మరో రెండేళ్లపాటు పదవీ కాలం పొడిగిస్తూ సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను ప్రభుత్వం యూపీఎస్సీకి పంపింది. అప్పట్లో లోపాలు ఉన్నప్పటికీ జేవీ రాముడు విషయంలో మౌనం వహించి ఆమోదించిన కేంద్ర హోంశాఖ ఇప్పుడు సాంబశివరావు విషయంలో తప్పుపట్టడం గమనార్హం. సాంబశివరావునే డీజీపీగా కొనసాగించాలని సీఎం గట్టి నిర్ణయం తీసుకుంటే పాత జాబితానే మళ్లీ పంపి ఖరారు చేయించుకుంటారని, లేకుంటే గౌతమ్ సవాంగ్ వైపు మొగ్గు చూపుతారని పరిశీలకులు అంటున్నారు. కాగా, ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ను డీజీపీగా తెచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలిసింది. -
'చంద్రబాబు తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి'
ఆంధప్రదేశ్ రాష్టానికి కొత్త డీజీపీ ఎంపిక విషయంలో ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరాలోచించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ సెల్ అధ్యక్షుడు నల్లా సూర్య ప్రకాశ్ సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లో నల్లా సూర్య ప్రకాశ్ మాట్లాడారు. తన సామాజిక వర్గానికి చెందిన జేవీ రాముడిని ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎంపిక చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్‌కి డీజీపీగా వ్యవహరించిన బి.ప్రసాదరావును పక్కనపెట్టడంలో చంద్రబాబు అంతర్యమేమిటో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. డీజీపీ ఎంపిక విషయంలో చంద్రబాబు మరోసారి ఆలోచిస్తే మంచిదన్నారు. అయితే ఇదే అంశంపై మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తుండటం పట్ల పలు అనుమానాలకు తావిస్తుందని నల్లా సూర్యప్రకాశ్ అన్నారు.