మళ్లీ..అభ్యర్థులు కరువు | no candidates for panchayat elections | Sakshi
Sakshi News home page

మళ్లీ..అభ్యర్థులు కరువు

Published Tue, Jan 7 2014 5:13 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

no candidates for panchayat elections

సాక్షి, నల్లగొండ: జిల్లాలో పది గ్రామపంచాయతీల ఉపఎన్నికలకు సంబంధించి మొత్తం 11నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. 10వార్డులు ఏకగ్రీవమయ్యాయి. గతంలో రిజర్వ్‌డ్ అభ్యర్థులు లేని ఆరు పంచాయతీలకు ఈ సారీ ఒక్క నామినేషన్ కూడా అధికారులకు అందలేదు. అంతేగాక త్రిపురారం మండలం గజలాపురంలోనూ ఒక్కరూ బరిలో లేరు. ఈ పంచాయతీకి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. వాస్తవంగా గత ఎన్నికల్లో ఈ పంచాయతీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. అయితే... సర్పంచ్  తన పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికకు అభ్యర్థులెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఇక్కడా ఎన్నిక లేనట్టే. ఉప సర్పంచే గ్రామ సారథిగా కొనసాగుతాడు.

 11 నామినేషన్లు....
 నూతన్‌కల్ మండలం లింగపల్లి గ్రామంలో ఒక అభ్యర్థే బరిలో నిలిచారు. తిప్పర్తి మండలం కంకణాలపల్లి గ్రామ పంచాయతీకి 6, మర్రిగూడ మండలం మేటిచందాపురం గ్రామానికి నాలుగు నామినేషన్లు దాఖ లయ్యాయి. అలాగే ఆయా పంచాయతీల్లోని 10వార్డులు ఏక గ్రీవమయ్యాయి. మూడు వార్డులకు కలిపి 8మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పరిశీ లన తర్వాత ఈ నెల 10న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నది. 18న ఉపపోరు జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement