బడి బస్సులో భద్రతెంత? | NO safe school bus | Sakshi
Sakshi News home page

బడి బస్సులో భద్రతెంత?

Published Sat, Jul 26 2014 2:30 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

NO safe school bus

నెల్లూరు (దర్గామిట్ట) : పాఠశాలల్లో పిల్లలకు అడిగినంత ఫీజు చెల్లించడమే విధి గా భావిస్తున్న తల్లిదండ్రులు, తమ పిల్ల లు రోజు ఎక్కుతున్న బడి బస్సుల్లో యా జమాన్యాలు నిబంధనలు పాటిస్తున్నా యా లేదో పట్టించుకోవడం లేదు. ఒక వేళ పట్టించుకున్నా ఒకరిద్దరు ఏమీ చే యలేక మిన్నకుండిపోతున్నారు.
 
  ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బస్సుల్లో రక్షణ చర్యలు, యాజమాన్యాలు నిర్లక్ష్యమంటూ బాధపడటం తప్ప చేసేదేమీ ఉండటం లేదు. యాజమాన్యాలు, సంబంధిత శాఖాధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతోనే విద్యార్థుల భద్రత గాలిలో దీపంలా తయారవుతుంది. జిల్లాలో గుర్తింపు పొందినవి, పొందని పాఠశాలలు దాదాపు 600కు పైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 913 బస్సుల్లో విద్యార్థులను చేరవేస్తున్నారు. ఇవి గాక వందకు పైగా ఆటోల్లో విద్యార్థులను పాఠశాలలకు పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మోటారు వాహనాల చట్టం ప్రకారం, బడి బస్సులు జీఓ నం. 35 ప్రకారం 32కు పైగా నిబంధనలు పాటించాలని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే వీటిలో ఏవీ పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 పాటించాల్సిన నిబంధనలు
  పాఠశాల పేరు, టెలిఫోన్ నంబరు, సెల్‌ఫోన్ నంబరుతో సహా పూర్తి చిరునామా బస్సు ఎడమ వైపు, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయించాలి. బస్సు డ్రైవర్‌కు 60 ఏళ్లకు మించి ఉండరాదు. పాఠశాల యాజమాన్యం బస్సు డ్రైవర్ ఆరోగ్య పట్టికను నిర్వహించాలి. రక్తపోటు, షుగర్, కంటిచూపు పరీక్షలను ప్రతి 3నెలలకొకసారి చేయించాలి. డ్రైవర్ నియామకం ముందు లెసైన్స్ వివరాలపై ఆర్టీఓ కార్యాలయంలో సంప్రదించి వివరాలు కనుక్కోవాలి. పాఠశాల బస్సులకు 5 ఏళ్లకు మించి అనుభవం ఉన్న వారిని మాత్రమే నియమించాలి.
 
  బస్సుకు సంబంధించిన కండీషన్ తెలుసుకునేందుకు నెలకొకసారి ప్రిన్సిపల్, పేరెంట్స్ కమిటీ తనిఖీ చేయాల్సి ఉంటుంది. బస్సులో ఫిర్యాదుల బుక్‌ను విధిగా ఉంచాలి.ప్రతి బస్సుకు ఒక అత్యవసర ద్వారం కల్పించాలి. బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను అందుబాటులో ఉంచాలి. నెలకొక సారి పేరెంట్స్ కమిటీ బాక్సును తనిఖీ చేయాలి. బస్సులో తప్పని సరిగా ఒక అటెండర్ ఉండాలి.  బస్సు డ్రైవర్, క్లీనర్, అటెండర్ యూనిఫాంను తప్పని సరిగా ధరించాలి.
  విద్యార్థుల పేర్లు, చిరునామాలను బస్సులో తప్పకుండా ఉంచాలి. బస్సు లోపలి భాగంలో పెద్ద అద్దం బిగించాలి. బస్సు లోపలి భాగం డ్రైవర్‌కు కనబడేలా ఉండాలి.
 బస్సు ఇంజన్ కంపార్ట్‌మెంట్‌లో అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంచాలి.
  బస్సు సీట్లు కింద బ్యాగులు పెట్టుకునేందుకు అరలు ఏర్పాటు చేయాలి. వాహనానికి బయటి వైపు నాలుగు వైపుల పైభాగం మూలల్లో గాఢ పసుపు పచ్చని రంగు గల ఫ్లాష్ లైట్లు అమర్చాలి.
 
 పాఠశాలకు బస్సు ఉపయోగిస్తున్నామని తెలియజేయడానికి ముందు భాగంలో పైన సుమారు 400 ఎంఎం సైజు బోర్డు సరిగ్గా అమర్చాలి. పాప, బాబు ఫొటోతో ఉన్న నల్లరంగుతో చిత్రీకరించ బడి ఉండాలి.  ప్రతి ఏడాది రవాణాశాఖ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను పొందాలి.
  బస్సులో తలుపులు సురక్షిత లాకింగ్ అమర్చబడి ఉండాలి.
 
 సైడ్ విండోలకు మధ్య 31కు మించని దూరంలో అడ్డంగా 3 లోహపు కడ్డీలను అమర్చబడి ఉండాలి.బస్సులో పరిమితి సీట్లు కంటే ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించరాదు.
 ప్రతి 10 బస్సులు ఉన్న బడిలో అదనంగా మరో బస్సును ఏర్పాటు చేయాలి. రవాణా, పోలీసు, విద్యాశాఖ ఆధ్వర్యంలో సంవత్సరానికి ఒకరోజు రోడ్‌సేఫ్టీ తరగతులు నిర్వహించాలి.
 
  బస్సు పుట్‌బోర్డుపై మొదటి మెట్టు భూమి నుంచి 325 ఎంఎం ఎత్తుకు మించరాదు. మెట్లు జారకుండా లోహంతో అమర్చబడి ఉండాలి. బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పట్టుకునేందుకు వీలుగా బస్సు ముందు తలుపు మించరాదు. యాజమాన్యం పేరేంట్స్ కమిటీ సమన్వయంతో ఒక టీచర్, పేరెంట్ బస్సు లో రోజూ ప్రయాణించేలా చూడాలి.   
 
 తనిఖీలు నామమాత్రమే
 పాఠశాల బస్సులను ఆయా శాఖాధికారులు నామ మాత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది మేలో ఫిట్‌నెస్ సమయంలో మాత్రమే బస్సును అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ తరువాత ఏడాదంతా ఎక్కడా త నిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో యాజమాన్యం నిర్లక్ష్యం కొంత కనపడుతుంది.
 
 పోలీసులు కూడా కనీసం నెలకొకసారి నిబంధనలు అమలు చేస్తున్నారో లేదో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కాని ఎప్పుడు తనిఖీలు చేసిన సందర్భాలు కనబడవు. చాలా పాఠశాలల యాజమాన్యం ఆటోల్లో విద్యార్థును తరలిస్తున్నారు. అయితే పరిమితికి మించి విద్యార్థులను తరలించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటోలను నెలకు రెండు సార్లు తనిఖీ చేస్తే కొంతైనా మార్పు రావచ్చు. ప్రతి 3 నెలలకొకసారి రవాణా, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేస్తే కనీస నిబంధనలు అమలవుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement