
సాక్షి, కృష్ణా జిల్లా : నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి నజ్మా సుల్తానాకు అరుదైన అవకాశం లభించింది. యూరోపియన్ యూనియన్ విద్యార్థులకు అందజేసే 20 లక్షల రూపాయల స్కాలర్‌షిప్ ఆమెను వరించింది. ప్రపంచ దేశాల్లో వివిధ యూనివర్సిటీల నుంచి ఈ స్కాలర్‌షిప్ కోసం వందలాది మంది విద్యార్థులు పోటీపడ్డారు. అయితే వీరందిరిలో భారతదేశం నుంచి ఇద్దరు విద్యార్థులను మాత్రమే యూరోపియన్ యూనియన్ ఎంపిక చేయడం విశేషం. కాగా నజ్మా స్వస్థలం గుంటూరు. ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ అందుకున్న నేపథ్యంలో పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment