డాలర్ శేషాద్రికి మళ్లీ గుండెపోటు | once again heart attack | Sakshi
Sakshi News home page

డాలర్ శేషాద్రికి మళ్లీ గుండెపోటు

Published Fri, Feb 19 2016 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

once again heart attack

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ పి.శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రి (69) గురువారం ఆస్పత్రిలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయానికి శ్రీవారి తరఫున పట్టువస్త్రాలు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన ఆయనను రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

పట్టువ స్త్రాల సమర్పణ కార్యక్రమం శుక్రవారం మిగిలిన అర్చకులు, సిబ్బందితో పూర్తి చేయిస్తామని తెలిపారు. పదవీ విరమణ తర్వాత కూడా సుమారు తొమ్మిదేళ్లుగా శ్రీవారి సేవలో నిమగ్నమైన శేషాద్రికి ఇదివరకే పలుమార్లు ఛాతీనొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement