ఒకరి మృతి, నలుగురికి గాయాలు
తాడేపల్లిగూడెం రూరల్(పశ్చిమగోదావరి): జాతీయరహదారి-16పై వెళ్తున్న కారు డీవైడర్‌పై ఉన్న చెట్లకు నీటిని అందించే టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలు కాగా, ఒకరు మృతిచెందారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడెపల్లిగూడెం మండలంలో బుధవారం జరిగింది. వివరాలు.. విజయవాడకు చెందిన టి. వరప్రసాద్(45) కుటుంబసభ్యులతో కలిసి పెనుగొండలో ఉన్న బంధువుల ఇంటిలో వివాహానికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఢివైడర్‌పై ఉన్న చెట్లకు నీటిని అందించే టిప్పర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో వరప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. అన్నపూర్ణ, సుజీత్, మాధవి, శ్రీదేవిలకు తీవ్రగాయాలయ్యాయి. వీరికి తాడేపల్లిగూడెం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి అనంతరం విజయవాడకు తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
టిప్పర్‌ను ఢీ కొన్న కారు
Published Wed, Feb 25 2015 10:13 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement