ఎందుకంత ప్రేమ!  | Outsourcing Service Employees Belongs To Chandrababu In Sri Venkateswara University | Sakshi
Sakshi News home page

ఎందుకంత ప్రేమ! 

Published Tue, Nov 19 2019 9:47 AM | Last Updated on Tue, Nov 19 2019 9:47 AM

Outsourcing Service Employees Belongs To Chandrababu In Sri Venkateswara University - Sakshi

ఆ ఐదేళ్లు ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. ఔట్‌సోర్సింగ్‌ పేరుతో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, విద్యా సంస్థల్లో ఉద్యోగుల వేతనాల్లో కోతపెట్టారు. చంద్రబాబునాయుడు బంధువునంటూ అధికారులు, కాంట్రాక్టు ఉద్యోగులను వేధింపులకు గురిచేశారనేఆరోపణలు వెల్లువెత్తినా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం కాంట్రాక్టు గడువు ముగిసినా ఎస్వీయూ అధికారులు ఆయన ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీని కొనసాగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. 

సాక్షి, చిత్తూరు: శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో 2016లో ఔట్‌సోర్సింగ్‌ సేవలు ప్రారంభమయ్యాయి. మొదట సెక్యూరిటీ సిబ్బందితో ఈ సేవలను అప్పటి వీసీ దామోదరం ప్రారంభించారు. 65 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. అనంతరం ఇంజినీరింగ్, శానిటేషన్‌ విభాగాలకు ఈ సేవలు విస్తరించాయి. ప్రస్తుతం సెక్యూరిటీ విభాగంలో 25 మంది, శానిటేషన్‌లో 69 మంది, ఇతర శాఖల్లో ఐదుగురు పనిచేస్తున్నారు. వీరంతా మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు సమీప బంధువైన భాస్కర్‌నాయుడుకు చెందిన పద్మావతి హాస్పిటాలటీ అండ్‌ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ సరీ్వసు పేరిట ఎస్వీయూలో పనిచేస్తున్నారు. వీరికి చెల్లించాల్సిన వేతనాల్లో ఒక్కో  ఉద్యోగి నుంచి రూ.3వేల నుంచి రూ.4వేలు నొక్కేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఎస్వీ యూలో ఔట్‌ సోర్సింగ్‌ సేవలు అందిస్తున్న పద్మావతి హాస్పిటాలిటీ సంస్థకు ఇచ్చిన అను మతి ఈ ఏడాది జూన్‌ 30వ తేదీతో ముగిసింది. అయితే ఎస్వీయూ అధికారులు కొందరు అనధికారికంగా ఆ ఏజెన్సీకే అనుమతి ఇచ్చి కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రూ.13, 600 చెల్లించాల్సిన సెక్యూరిటీ సిబ్బందికి రూ.9 వేలు చెల్లిస్తున్నట్లు తెలిసింది. స్వీపర్లకు నెలకు రూ.9వేలు చెల్లించాల్సి ఉంటే రూ.7వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నట్లు బాధితులు బోరుమంటున్నారు. ఐదుగురు ఆఫీ సు సిబ్బందికి రూ.12,600 వేతనం ఇవ్వాల్సి ఉండగా రూ.9,600 చెల్లిస్తున్నారు. ఇంకా వెట ర్నరీ వర్సిటీలో 100 మంది ఔట్‌సోర్సింగ్‌ కింద పనిచేస్తుంటే వారి వేతనంలోనూ కోత విధిస్తు న్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆరోపణలున్నా.. 
మాజీ సీఎం చంద్రబాబు బంధువునని చెప్పుకుంటూ భాస్కర్‌నాయుడు ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ప్రారంభించి ఉద్యోగులకు సరిగా వేతనాలు చెల్లించడం లేదని, పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపులు లేవని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీయూనుంచి అధిక మొత్తంలో నిధులు పొంది, ఉద్యోగులకు అరకొర ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు నిర్వహించిన బహిరంగ సభల్లో భాస్కర్‌నాయుడు దోపిడీపై ధ్వజమెత్తిన సందర్భాలున్నాయి. అటువంటి ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ కాంట్రాక్టు గడువు ముగిసినా ఎస్వీయూ అధికారులు ఎందుకు కొనసాగిస్తున్నారని ఉద్యోగులు ప్రశి్నస్తున్నారు.

వారం లోపు పూర్తి 
ఎస్వీయూలో నూతన ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీని వారం లోపు పూర్తి చేస్తాం. ఇన్‌చార్జ్‌ వీసీ ఆదేశాల మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే నూతన ఏజెన్సీ సేవలు అందుబాటులోకి తెస్తాం. అప్పటివరకు ప్రసుత్తం ఔట్‌ సోర్సింగ్‌ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా తాతాలి్కక ఏర్పాట్లు చేశాం. 
– ప్రొఫెసర్‌ పీ. శ్రీధర్‌రెడ్డి, ఎస్వీయూ రిజిస్ట్రార్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement