మితిమీరుతున్న సీమాంధ్రుల ఆందోళన
Published Sun, Aug 18 2013 5:09 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్రులు చేస్తున్న ఆందోళన మితిమీరుతోందని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై తిరుమలలో జరిగిన దాడిని ఖం డించారు. శనివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. కలిసి ఉండాలంటూనే తెలంగాణ ప్రజాప్రతినిధులపై దాడికి దిగడం సరికాదన్నా రు. తెలంగాణలో శాంతియుతంగా ఉద్యమిస్తుంటే ఉక్కుపాదంతో అణచివేసిన పోలీసులు.. సీమాంధ్రలో హింస జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
సీమాంధ్రుల ఆందోళనలకు సహకరిస్తున్న డీజీపీని వెంటనే మార్చాల ని డిమాండ్ చేశారు. డీజీపీ వైఖరిపై ప్రధాని, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. సిరిసిల్లలో చేనేత పరి శ్రమను ఆధునీకరించేందుకు కేంద్ర మం త్రులతో మాట్లాడుతున్నానని చెప్పారు. ఆత్మహత్యలు లేకుండా అన్ని విధాలా చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్ర యత్నిస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో నాయకులు సునీల్‌రావు, కర్ర రాజశేఖర్, కన్న కృష్ణ, అంజనీప్రసాద్, గందె మహేష్, సదానందచారి, మెండె చంద్రశేఖర్, బుచ్చిరెడ్డి, మోసిన్, ఎం.రాజేందర్, మనోహర్‌రెడ్డి, మదు తదిత రులు పాల్గొన్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణానికి రెట్టింపు కృషి అవసరం
వేములవాడ : తెలంగాణ పునర్నిర్మాణంలో రెట్టింపు కృషి అవసరమని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి ప్రజలెవరూ అశాంతికి తావివ్వలేదని, సీమాంధ్రులు కృత్రిమ ఉద్యమం ముసుగులో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపారు.
రమేశ్ సుప్రీంకు వెళ్తాననడం సరికాదు
ఎమ్మెల్యే పదవికి అనర్హుడంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రమేశ్‌బాబు సుప్రీంకోర్టుకు వెళ్తాననడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి, ఆలయ ఉద్యోగుల సంఘం నాయకులు హరికిషన్, తిరుపతి రావు, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, శ్రీరాములు, నునుగొండ రాజేందర్, కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాస్, చిలుక రమేశ్, దైత కుమార్, శేఖర్, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
Advertisement