పొన్నం ప్రభాకర్ (ఫైల్ పోటో)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీం ఎంపీ పొన్న ప్రభాకర్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఇదివరకే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో 15 లక్షల, 50వేల, 834 ఓట్లు ఉంటే ప్రస్తుతం 13 లక్షల, 23 వేల, 433 ఓట్లు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఒక్క కరీంనగర్ పార్లమెంట్‌లోనే రెండు లక్షల ఇరవైవేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. ఓటర్ల జాబీతాలో జరుగుతున్న అవకతవకలకు బాధ్యలెవరని ఆయన ప్రశ్నించారు.
ఒక్క కరీంనగర్ శాసనసభ నియోజవర్గంలోనే తొంభైవేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీనిపై ఎన్నికల కమిషన్ సీరియస్‌గా స్పందించాలి. వీ.ఆర్వో పరీక్షలకు వెళ్లేందుకు బస్సుల సౌకర్యం లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంగర కోలాన్ సభకు మాత్రం లక్షల బస్సులను తరలించారు. పరీక్షకు హాజరైనా మహిళల పుస్తెలు, మెట్టెలు తీసి వారిని అవమానపరిచారు. ఆ చర్యకు పాల్పడిని అధికారులపై చర్యలు తీసుకోవాలి. గవర్నర్ కూడా దీనిపై స్పందించాలి’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment