ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: అంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, స్థానిక సంస్థలు తదితర విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘ నాయకులు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఎం గేయానంద్, వై. శ్రీనివాసరెడ్డిలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, యూనివర్సిటీ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కేఎస్ కోటేశ్వరరావులు సచివాలయంలో సీఎంను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
ఆ ఉద్యోగులను రెగ్యులర్ చేయండి
Published Sun, Nov 23 2014 2:33 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement