మరో ఏడాది ‘కాంట్రాక్టే’
ఉద్యోగుల క్రమబద్ధీకరణకు బ్రేక్
కలెక్టరేట్ : జూన్ 30 వరకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సిం గ్ సేవలను వినియోగించి కొనసాగింపుపై నిర్ణ యం తీసుకుంటామని గత ఉమ్మడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ మేరకు జీవో నంబర్ 84 జారీచేసింది. గడువు సమీపించినా ప్రస్తుత సర్కార్ స్పష్టతనివ్వలేదు. రెండు రోజు లుగా అధికార పార్టీ మంత్రులు బహిరంగంగా గడువు పొడిగింపుపై పలు రకాలుగా ప్రకటిస్తుండడం.. తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా ఉత్తర్వులు వెలువరించకపోవడంతో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సందిగ్ధంలో పడేసింది.
దీంతో ఉద్యోగ భద్రత కోసం సోమవారం అన్ని జిల్లాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో యూనియన్ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఆర్థికశాఖ మంత్రి సమక్షంలో హైదరాబాద్లో చర్చలు సాగించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జీవో వచ్చేంత వరకు చర్చల్లో తీసుకున్న నిర్ణయం మౌఖిక ఆదేశాలతో అమలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
క్రమబద్ధీకరణకు బ్రేక్
ఎన్నికలు ముందు, తర్వాత కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వ శాఖల్లో అన్ని క్యాడర్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలా? లేక మూడో, నాలుగో తరగతి ఉద్యోగులకే అవకాశం కల్పించాలా? దశలవారీగా క్రమబద్ధీకరించా లా? ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిం చాలా.. కొనసాగించాలా..? అనే అంశాలపై ఇంకా అధ్యయనం జరుగుతోంది. వీటన్నింటిపై సమగ్ర అధ్యయనం కోసమే మరో ఏడాది పాటు సేవలను పొడిగించినట్లు తెలుస్తోంది.
జిల్లాలో 12,670 కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండగా, ఔట్సోర్సింగ్ సేవల ఏజెన్సీల ద్వారా నియమితులైన ఆరు వేలకు పైగా సిబ్బందిలో ఆందోళన నెలకొంది. హౌసింగ్, రెవెన్యూ, బీసీ, సాంఘిక సంక్షేమం, ఎస్సీ, బీసీ కార్పొరేషన్, విద్యాశాఖ, పుర, నగర పాలక సంస్థ, డీఆర్డీఏల్లో వందలాది మంది ఏజెన్సీల ద్వారా నియమితులై పదేళ్లుగా పనిచేస్తున్నారు. మరికొన్ని ప్రభుత్వ శాఖల్లో ఆయా శాఖలే నేరుగా పరీక్షలు నిర్వహించుకుని రోస్టర్ కం మెరిట్ పద్ధతిన అవసరమైన సిబ్బందిని నియమించుకున్నాయి. ఔట్సోర్సింగ్ సిబ్బంది ని పర్మినెంట్ చేయడానికి సాంకేతిక సమస్యలుంటాయని చెబుతుండడం వారిని ఆందోళన కలిగిస్తోంది.