ప్లాస్టిక్ వాడితే రూ.500 పెనాల్టీ
అధికారులకు కమిషనర్ ఆదేశం
విశాఖపట్నం సిటీ: ప్లాస్టిక్ నిషేధం మార్చి నుంచీ అమల్లోకి వచ్చినందున ఇక ఎవరు దాన్ని వాడినా రూ. 500 పెనాల్టీ వేయాలని కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన రోడ్డు పక్కన ఉండే హోటళ్లపై దృష్టి సారించారు. హోటళ్లలో టీ కప్‌లు, చట్నీలు కట్టే ప్లాస్టిక్ కవర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీశారు. తోపుడు బండిపై టిఫిన్లు అమ్ముతున్న ఓ వ్యక్తికి రూ. 500 జరిమానా వేశారు. ఆయన వద్ద నుంచి పెద్ద సంఖ్యలో లభించిన ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ వాడేవారిని వదలవద్దని అధికారులకు కమిషనర్ సూచించారు. ప్రతీ దుకాణం దగ్గరా ఉండి పరి శీలించాలని, ఎవరైనా ప్లాస్టిక్ కవర్లతో వెళుతుంటే ఆ దుకాణ యజమానిని నిలదీయాలని, భారీ పెనాల్టీలు వసూలు చేసే వరకూ వెనకాడవద్దని సూచించారు. పెనాల్టీలను చూసి ఆ జోలికి వెళ్లకుండా చేయాలన్నారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ డాక్టర్. వై.శ్రీనివాసరావు, ఏఎంఓహెచ్ డా క్టర్ రామ్మోహన్, ఇఇ కృష్ణారావు, దామోదర్ పాల్గొన్నారు.
సానుభూతితో కాంట్రాక్టర్ల సమస్యలు
సానుభూతితోనే కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరిస్తానని కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అ న్నారు. పాత కౌన్సిల్ హాల్లో సోమవారం కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులతో సమావేశమై స్మార్ట్ సిటీ అభివృద్దికి సహకరించాలన్నారు. కాంట్రాక్టర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు డి. నారాయణ రెడ్డి, అధ్యక్షుడు రొంగలి జగన్నాథం, ఆర్గనైజింగ్ కార్యదర్శి సనపల వర ప్రసాద్‌తో పాటు 150 మంది పాల్గొన్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్ : ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడమే ల క్ష్యంగా పలు వార్డులను దత్తత తీసుకోవడానికి పేర్లను నమోదు చేసుకోవాలని కమిషనర్ అన్నారు. కౌన్సిల్ హాల్లో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ వార్డుల అభివృద్ధిపై ఆసక్తి కలిగిన అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. ప్రజలందరికీ ఇల్లు, స్వయం సంఘాలకు మార్కెట్ నిపుణత, బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి 20 అంశాలపై పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.