70 లీటర్ల ట్యాంకు.. 72 లీటర్లకు బిల్లు | Petrol Pump staff cheating on quantity of fuel | Sakshi
Sakshi News home page

70 లీటర్ల ట్యాంకు.. 72 లీటర్లకు బిల్లు

Published Sat, Feb 3 2018 11:50 AM | Last Updated on Fri, Sep 28 2018 3:27 PM

Petrol Pump staff cheating on quantity of fuel - Sakshi

బిల్లు చూపుతున్న చంద్రశేఖర్ , పెట్రోల్‌బంకులో ఇచ్చిన బిల్లు , కంపెనీవారు ఇచ్చిన డీజిల్ ట్యాంక్ కెపాసిటీ

తాడేపల్లి(తాడేపల్లి రూరల్) : వాహనం ట్యాంకు సామర్థ్యం 70 లీటర్లు ఉంటే 72 లీటర్లు డీజిల్ కొట్టామని బిల్లు చూపి బుకాయించిన ఘటన తాడేపల్లి పట్టణ పరిధిలోని బైపాస్ వెంట ఉన్న ఓ పెట్రోల్ బంకులో జరిగింది.బాధితుడు చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం..తాడేపల్లి పట్టణ పరిధిలోని గోపు ఫిల్లింగ్ స్టేషన్‌లో తన వాహనానికి పెట్రోలు నింపుకునేందుకు చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు.ఫుల్ ట్యాంక్ చేయాలని కోరడంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డీజిల్ ట్యాంక్‌లో ఆయిల్ నింపారు.72 లీటర్లు కొట్టినట్లు బిల్లు చేతిలో పెట్టారు.70 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులో 72 లీటర్లు ఎలా కొట్టారు...2,3 లీటర్ల డీజిల్ ఉంది.మొత్తం 5 లీటర్ల వరకు తేడా వస్తుంది, ఇదెక్కడి న్యాయమని చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.దీంతో ముందు బిల్లు కట్టి మాట్లడమంటూ చేతిలో ఉన్న కార్డును లాక్కున్నారు.దీంతో బంకు యజమానికి తన కారుకున్న డీజిల్ కెపాసిటీని చూపించినా, అవన్నీ మకు తెలియదు,ముందు బిల్లు కట్టి వెళ్లండి అంటూ కారు నిలిపివేసి దౌర్జన్యంగా తన దగ్గర డబ్బులు వసూలు చేశారని చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై తూనికలు కొలతల శాఖాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement