విహారం.. ఓ విషాదం | picnic..became tragedy | Sakshi
Sakshi News home page

విహారం.. ఓ విషాదం

Published Mon, Aug 5 2013 4:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM

picnic..became tragedy

బాల్కొండ, న్యూస్‌లైన్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు విహార యాత్ర కొందరికి విషాదంగా మా రుతోంది. గోదావరి పరవళ్లను తిలకించేందుకు వస్తున్న సందర్శకులు నదిలో గల్లంతవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రాజెక్టు అధికారులు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖ లాలు కనిపించడం లేదు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో వరద గేట్ల వైపు నీటిలోకి దిగుతున్న పలువురు మృత్యువాత పడుతున్నారు. ప్రాజెక్ట్ వద్ద రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు సందర్శకులు నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. ప్రాజెక్టు దిగువ భాగాన గోదావరి నదిలో గురువారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం కడ్తల్‌కు చెందిన ముగ్గురు యువకులు చిక్కుకు పోగా స్థానిక జాలర్లు ఇద్దరిని కాపాడి బయటకు తీశారు. ఒక యువకుడు నదిలో గల్లంతయా డు. ఆ యువకుని ఆచూకీ ఇప్పటి వరకు లభించలే దు. శనివారం జిల్లాలోని ఎడపల్లి మండలం జాన్కం పేట్‌కు చెందిన బత్తుల నర్సయ్య అనే యువకుడు గోదావరిలో నీటి ప్రవాహానికి కొ ట్టుకు పోయాడు. మృత దేహం ఆదివారం లభ్యమైం ది.
 
 ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టునకు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో వర ద గేట్లను మూసివేయగా యువకుని మృతదేహం లభించేందుకు అవకాశం ఏర్పడింది. లేనిపక్షంలో నీటి ప్రవాహానికి ఎక్కడికి కొట్టుకుపోయేదోనని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు వద్ద సందర్శకుల సంరక్షణకు ఎలాంటి చర్యలు కనిపిం చవు. సందర్శకులకు మార్గనిర్దేశనం చేసేవారు ఉం డరు. కొంతమంది ఆనకట్టపైకి వెళ్లి రిజర్వాయర్‌లో నీటిని, వరద గేట్ల ద్వారా కిందికి దూకుతున్న గోదావరిని చూస్తూ పరవశించిపోతారు. మరికొందరు వరదగేట్ల వైపు దిగువ భాగానికి వెళ్లి నదిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే పలువురు మృత్యువు ను కౌగిలించుకుంటున్నారు.ఇక్కడ సందర్శకులను ని లువరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అయితే ఇది పోలీసు పనిగా ప్రాజెక్టు అధికారులు పేర్కొం టే... ప్రాజెక్టు అధికారు లే బాధ్యత వహించాలని పో లీసులు అంటున్నారు. చివరికి ఎవరూ పట్టించుకోవ డం లేదు. డ్యామ్ పైన, డ్యామ్ దిగువ భాగన గోదావరికి వెళ్లే మార్గంలో, ప్రాజెక్టు ఆనకట్టపై ఎక్కడ కూ డా ఒక్క ప్రమాద హెచ్చరిక బోర్డు లేదు. ప్రాజెక్ట్ వర ద కాలువ వద్ద సైతం ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేక పోవడంతో అనేక మంది యువకులు 2010లో గల్లంతయ్యారు.  డ్యామ్ పైన పోలీస్ సబ్‌కంట్రోల్ బూత్ ఉందంటే అది నామ మాత్రమే! అధికారులు అంతకంటే పట్టించు కోరు. పర్యాటకులూ... ఇక్కడికొస్తే తస్మాత్ జాగ్ర త్త.. మరైతే రాకున్నా ఫర్వాలేదండి..అంటున్నారు స్థానికులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement