పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి విడనాడి పార్లమెంట్‌లో వెంటనే బిల్లు ఆమోదించాలని టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కె. హన్మంతు అన్నారు. శనివారం తెలంగాణ జేఏసీ బంద్‌కు ఆర్టీసీ కార్మికులు మద్దతు ప్రకటించారు. దీంతో బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. టీఎంయూ ఆధ్వర్యంలో పరిగి ప్రధాన వీధుల్లో బస్సులతో ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ వాదులు ర్యాలీ నిర్వహించారు. వీరికి ఆటో యూనియన్, ఫోర్‌వీలర్స్ అసోసియేషన్లతో పాటు ఆయా తెలంగాణా పార్టీలు, సంఘాలు, యూనియన్లు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా హన్మంతు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం నిరవధిక సమ్మె చేసేందుకైనా సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. వెంటనే తెలంగాణ బిల్లును ఆమోదించకపోతే మరో సకల జనుల సమ్మెకు ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగులు సిద్ధం కావాలని ఆయన కోరారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యే దశలో సీమాంధ్ర పెట్టుబడిదారులు సమైక్యాంధ్ర పేరుతో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోకే పరిమితం కావటంతో పరిగి డిపోకు రూ. 7లక్షల వరకు నష్టం వాటిల్లింది.
మరోసారి నిరవధిక సమ్మెకు సిద్ధం
Published Sun, Sep 8 2013 6:18 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement