'విశాఖలో మొక్కలు నాటే కార్యక్రమం'
విశాఖపట్నం: ఉద్యాన, అటవీ శాఖ అధికారులతో సంప్రదించి విశాఖ నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ మొక్కలు నాటోద్దని స్థానిక ప్రజలకు ఆయన సూచించారు. ఒక పద్దతి ప్రకారం శాస్త్రీయంగా మొక్కలు నాటాల్సిన అవశ్యకతను నారాయణ ఈ సందర్భంగా వివరించారు.
నగరంలోని ప్రతి డివిజన్కు ఓ ఉన్నతాధికారిని, అతనికి సహాయంగా బిల్ కలెక్టర్ను నియమిస్తామని చెప్పారు. నగరంలోని ప్రతి డివిజన్కు ఏఏ అధికారిని నియమిస్తామో జాబితాను సిద్ధం చేస్తున్నామని... ఈ నెల 30 నాటికి ఆ జాబితా విడుదల చేస్తామని నారాయణ వెల్లడించారు.