
సాక్షి, అనంతపురం సెంట్రల్: ఓట్ల లెక్కింపు రోజున, ఆ తర్వాత జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత, సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలనిసిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ఇటీవల తీసుకున్న చర్యలను శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. పక్షం రోజుల్లో 399 పల్లె నిద్రలు, 84 కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, 2263 గ్రామ సందర్శనలు, 909ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు, 1043 విజుబుల్ పోలీసింగ్ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.
తనిఖీల్లో రికార్డులు లేని స్కార్పియో, మూడు కార్లతో పాటు, 54 ద్విచక్ర వాహనాలు, 29 ఆటోలు, 45 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ వేళ ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ప్రణాళికాబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి సున్నితమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. గొడవల జోలికెళితే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. మహిళల ద్వారా ఆయా కుటుంబాల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment