వెంకయ్య: ఒరే సుబ్బయ్య.. యాడికో పోతున్నావ్.. దా టీ తాగి పోతువుగాని. పింఛనీ సొమ్ము తీసుకున్నావా?
సుబ్బయ్య:ఆ.. తీసుకున్నా.. మరి నీవో..‘ఓరేయ్ వెంకీగా రెండు టీ పట్రా అంటూ కేకేశాడు’.
వెంకయ్య తీసుకున్నాలేరా... ఏదో జగన్ పుణ్యమా అని రూ. 2వేలు ఇచ్చారు.
సుబ్బయ్య: అదేందప్పో.. ఇచ్చింది సంద్రబాబు పెభుత్వమైతే.. జగన్ పేరు చెబుతున్నావ్!
వెంకయ్యనే నిజమే సెబుతున్నా. తాను అధికారంలోకి వస్తే పింఛనీ సొమ్మును రూ. 2వేలు సేస్తానని జగన్ సెప్పాడు కదా..ఆయన సెప్పబట్టేరా పింఛనీ మొత్తం పెరిగింది. లేకుంటే ఎన్నేళ్లయినా ఈళ్లు మనకు పింఛనీ సొమ్ము పెంచేరా? ఉన్నోళ్లనే పీకేత్తుండ్రు.
సుబ్బయ్య: నీవు సెప్పిందే కరెక్టే. జగన్ సెప్పాడు కాబట్టే సంద్రబాబు ఇచ్చాడు. మరీ జగన్ అధికారంలోకి వస్తే రూ. 3 వేలు సేస్తానన్నాడు కదా.. ఇదెట్లబ్బా?
వెంకయ్య సెస్తాడు. ఎందుకంటే జగన్ మన రాజన్న బిడ్డ. ఆళ్లూ ఇచ్చిన మాట ఏనాడూ తప్పలేదు.
సుబ్బయ్య:గేరంటీగా సేస్తాడా?
వెంకయ్య సేస్తాడబ్బా.. కడుపున పుట్టిన బిడ్డలే మన మొఖాలకు ఇంత సిల్లరేయడం లేదు. పింఛనీ సొమ్ము రూ. 3వేలు వస్తే కాసింత మనకూ ఇంటిలో గౌరవముంటుం ది. రాజశేఖరరెడ్డి పెభుత్వంలో చాలా మందికి నిజాయితీగా పింఛనీలు ఇచ్చాడప్పా. సంద్రబాబు వచ్చాకే మనూళ్లోనే చాలా మందికి పింఛనీ రాకుండా చేశారు.
సుబ్బయ్య: ఔనన్న.. నాక్కూడా పింఛనీ రాకుండా చేశారు. ఏవో తిప్పలు పడి మళ్లీ తెచ్చుకున్నాననుకో. ఆ తిప్పలు పగోడికి కూడా వద్దు. అందుకే ఈ సారి మన రాజన్న బిడ్డను సీఎంగా సేసుకుందాం. – సిటీ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment