పాడేరు సిబ్బందిని చూసి నేర్చుకోండి | Praveen Kumar Slams GVMC Red Cross Hospital Staff | Sakshi
Sakshi News home page

పాడేరు సిబ్బందిని చూసి నేర్చుకోండి

Published Sat, Sep 22 2018 7:09 AM | Last Updated on Tue, Sep 25 2018 2:08 PM

Praveen Kumar Slams GVMC Red Cross Hospital Staff - Sakshi

గుల్లలపాలెం జీవీఎంసీ(రెడ్‌క్రాస్‌) ఆస్పత్రి వైద్య సిబ్బందిని ప్రశ్నిస్తున్న జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

విశాఖపట్నం, మల్కాపురం : జీవీఎంసీ 47వ వార్డు గుల్లలపాలెంలోని జీవీఎంసీ (రెడ్‌క్రాస్‌)ఆస్పత్రి వైద్య సిబ్బంది పని తీరుపై జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆగ్రహం చెందారు. ‘ఇంత మంది ఉండి కూడా గర్భిణులకు ప్రసవాలు ఎందుకు చేయడం లేదు, పైన ఉన్న పిల్లల వార్డులో సేవలందించడం లేదెందుకు’ అని ప్రశ్నించారు. పారిశ్రామిక ప్రాంతంలో డెంగ్యూ పరిస్థితి తెలుసుకునేందుకు శుక్రవారం కలెక్టర్‌ ఈ ప్రాంతానికి వచ్చారు. జీవీఎంసీ ఆస్పత్రిని సందర్శించి జ్వరపీడితుల సమస్యలు, ఓపీ రికార్డులు పరిశీలించారు.

ఆస్పత్రి పైన ఉన్న చిల్డ్రన్‌ వార్డును ఎందుకు నిరుపయోగంగా ఉంచుతున్నారని అడగ్గా సిబ్బంది కొరత అని చెప్పుకొచ్చారు. ఇక్కడ స్టాఫ్‌ నర్స్‌లు ఎంతమంది ఉన్నారని కలెక్టర్‌ ప్రశ్నించగా, ముగ్గురు అని సమాధానం వచ్చింది. పాడేరు ఆస్పత్రిని చూడండి, కేవలం ఒక్క స్టాఫ్‌ నర్స్‌ మాత్రమే సేవలందిస్తున్నారు, ఆమె వైద్య సేవలు రోగులకు ఎంతో సంతృప్తినిస్తున్నాయన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ హేమంత్‌ కుమార్, అసిస్టెంట్‌ మెడికల్‌ హెల్త్‌ అధికారి డాక్టర్‌ మురళీమోహన్, డీఎంహెచ్‌వో రమేష్‌  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement