ప్రీమియం చెల్లిస్తున్నా అందని వైద్యం
హైదరాబాద్: నగదు రహిత వైద్య పథకం (ఈహెచ్‌ఎస్) అమలు తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. వీరి వేతనాల్లో నుంచి ప్రీమియం చెల్లింపులు జరుగుతున్నా ఏ ఆస్పత్రిలోనూ ఈ పథకం కింద వైద్యం అందడం లేదు. దీంతో వీరంతా వైద్యసేవలకోసం మళ్లీ డబ్బు చెల్లించక తప్పడం లేదు. మరోవైపు వైద్య విద్యా శాఖ సంచాలకుల కార్యాలయానికి ప్రతిరోజూ 200 నుంచి 300 మెడికల్ రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులొస్తున్నాయి.
వైద్య ఆరోగ్యశాఖ అధికారులతోపాటు మంత్రి సైతం ఉద్యోగులకు అందించే వైద్య ప్యాకేజీపై ప్రైవేటు ఆస్పత్రులతో చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీ రేట్లు చెల్లిస్తే వైద్యం అందించబోమంటూ ప్రైవేటు ఆస్పత్రులు కుండబద్దలు కొట్టాయి. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల దాకా ప్రత్యేక క్లినిక్‌లు నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా అమలుకాలేదు.
వారంలోగా పరిష్కరిస్తా:మంత్రి కామినేని
ఈ విషయమై కొంతమంది సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌ను కలిశారు. మంత్రి స్పందిస్తూ వారంలోగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్టు ఉద్యోగులు తెలియజేశారు.
పేరుకే నగదు రహిత వైద్య పథకం
Published Thu, May 21 2015 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM
Advertisement