ఏపీలో 27న రాష్ట్రపతి పర్యటన | President Ramnath Kovind AP Tour Confirmed | Sakshi
Sakshi News home page

ఏపీలో 27న రాష్ట్రపతి పర్యటన

Published Mon, Dec 25 2017 9:35 PM | Last Updated on Sat, Aug 18 2018 8:53 PM

President Ramnath Kovind AP Tour Confirmed - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన ఖరారైంది. ఈనెల 27న ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 9.35 నిమిషాలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.30గంటలకు ఆచార్యనాగార్జున యూనివర్సిటీలో జరగనున్న ఇండియన్‌ ఎకనామిక్‌ అసోసియేషన్‌ శతాబ్ధి వేడుకలను ప్రారంభిస్తారు.

తర్వాత 11.45గంలకు సచివాలయంలో ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును కోవింద్‌ ప్రారంభిస్తారు. మద్యాహ్నం 12.50 గంటలకు సచివాలయం బ్లాక్‌-1లోని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ను పరిశీలిస్తారు. 3.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తిరగి ఢిల్లీ వెళ్లనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement