
కుట్రలపై అప్రమత్తం
సీమాంధ్రులు రాష్ట్రపతి సంతకం చేసే సమయంలో పెన్నులెత్తుకెళ్తారేమో: టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ఎద్దేవా
వరంగల్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రక్రియను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు పన్నుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని టీ-జేఏసీ చైర్మర్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. వరంగల్‌లో విశ్రాంత టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే సందర్బంగా ‘తెలంగాణ పునర్నిర్మాణంలో మేధావుల పాత్ర’ అంశంపై మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజం సంక్షోభంలో ఉన్న సమయంలో మేధావులు ప్రజలకు రక్షణగా నిలవాలని అన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రపతి సంతకం పెట్టే సమయంలో సీమాంధ్ర నేతలు పెన్ను ఎత్తుకెళ్లే నాటకం ఆడుతారేమోనని ఎద్దేవా చేశారు. బాబు తెలంగాణకు అనుకూలమంటూ లేఖ ఇచ్చి.. మళ్లీ ఇప్పుడు ఎవరినడిగి రాష్ట్రం ఇచ్చారని చెప్పడం విడ్డూరమన్నారు.