YSRCP MLA 2019 List For East Godavari | East Godavari MLA Candidates List For Assembly Elections 2019 - Sakshi
Sakshi News home page

తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌

Published Mon, Mar 18 2019 11:57 AM | Last Updated on Tue, Mar 19 2019 4:31 PM

Profiles of East Godavari YSRCP Candidates - Sakshi

 రాజమహేంద్రవరం రూరల్‌ - ఆకుల వీర్రాజు


అభ్యర్థి: ఆకుల వీర్రాజు
వయస్సు: 68 విద్యార్హత:  సెవెన్త్‌ ఫారమ్‌
నేపథ్యం : పండ్ల వ్యాపారంలో ప్రసిద్ధిగాంచారు.
రాజమహేంద్రవరం ఛాంబర్‌ఆఫ్‌కామర్స్‌ అధ్యక్షునిగా రెండుసార్లు వ్యవహరించారు.  రాజమహేంద్రవరం నగరంతో పాటు, పరిసర ప్రాంతాలలో పలు యూనియన్లకు గౌరవాధ్యక్షునిగా సేవలు అందిస్తున్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుకు సన్నిహితునిగా ఉంటూ, నగర కాంగ్రెస్‌ బ్లాక్‌ –1 కాంగ్రెస్‌ అధ్యక్షునిగా పనిచేశారు. 2014లో వై ఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 18,282 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా ప్రజాసమస్యలపై ఉద్యమించారు. 

రాజమహేంద్రవరం సిటీ - రౌతు సూర్యప్రకాశరావు


అభ్యర్థి :  రౌతు సూర్యప్రకాశరావు  
జననం: 18.06.1958 విద్యార్హతలు : బీకాం, బీఎల్‌
తల్లిదండ్రులు : రౌతు తాతాలు, పార్వతమ్మ
కుటుంబం: భార్య సౌభాగ్యలక్ష్మి, కుమారుడు వరుణ్‌బాబు, కుమార్తె సౌజన్య
రాజకీయ నేపథ్యం: స్డూడెంట్స్‌ యూనియన్‌ లీడర్‌గా, కాంగ్రెస్‌ నగర అ«ధ్యక్షునిగా వ్యవహరించారు. ఆంధ్రకేసరి యువజన సమితి లో పలు పదవులు నిర్వర్తించారు. చాంబర్‌ ఆఫ్‌  కామర్స్‌ అధ్యక్షుడు, కోస్తా జిల్లాల వర్తక సంఘం అధ్యక్షుడు (1989–1999), ఎపెక్స్‌ క్లబ్‌ చైర్మన్,(1987–88), జిల్లా ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు (1990–2004) రాజమహేంద్రవరం  ఎమ్మెల్యే (2004–2011), తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు(2011, 2012), స్టేట్‌ ఎస్యూరెన్స్‌ కమిటీ చైర్మన్‌( ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌), గోదావరి స్విమ్మర్స్‌ క్లబ్‌ గౌరవాధ్యక్షుడు.

రాజానగరం -  జక్కంపూడి రాజా ఇంద్రవందిత్‌


 అభ్యర్థి : జక్కంపూడి రాజా ఇంద్రవందిత్‌
తల్లిదండ్రులు: రామ్మోహనరావు, విజయలక్ష్మి
పుట్టిన తేదీ : 5 అక్టోబర్‌ 1988 విద్యార్హతలు : బీకాం, ఎం బీఏ, కుటుంబం : భార్య డాక్టర్‌ రాజశ్రీ, ఇద్దరు కుమార్తెలు
రాజకీయ నేపథ్యం: తండ్రి రామ్మోహనరావు పూర్వపు కడియం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్‌ మంత్రి మండలిలో ఆర్‌ అండ్‌ బీ మంత్రిగా పని చేశారు. తల్లి విజయలక్ష్మి
2009 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 2014 ఎన్నికల్లో రాజానగరం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 

అమలాపురం - పినిపే విశ్వరూప్‌


  అభ్యర్థి: పినిపే విశ్వరూప్‌
తల్లిదండ్రులు    : సీతమ్మ, రెడ్డి పంతులు
పుట్టిన తేదీ: 02.10.1962
విద్యార్హత: బీఎస్సీ, బీఈడీ
భార్య : బేబి (మీనాక్షి)
రాజకీయ నేపథ్యం : 1987లో కాంగ్రెస్‌ నాయకునిగా రాజకీయ అరంగ్రేటం. 1998 ఉప ఎన్నికల్లో, 1999 సాధారణ ఎన్నికల్లో  ముమ్మిడివరం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ ఆభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.
ముమ్మిడివరం నుంచి (2004–09), అమలాపురం నుంచి (2009–14) ఎమ్మెల్యేగా ఉన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య ప్రభుత్వాలలో రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో 2010 నుంచి 2013 వరకు పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య, వెటర్నరీ యూనివర్సిటీ మంత్రిగా పనిచేశారు. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఆది నుంచి మహానేత వైఎస్‌ విధేయుడిగా ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం తర్వాత అయిదు నెలల ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.  రాష్ట్ర పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సభ్యునిగా పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నియోజవర్గ కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. 

అనపర్తి - డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి


     అభ్యర్థి: డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి
పుట్టిన తేదీ: 31.10.1961
తల్లిదండ్రులు: సీతయ్యమ్మ, గంగిరెడ్డి,     
విద్యార్హతలు:  ఎంబీబీఎస్, ఎంఎస్‌
(జనరల్‌ సర్జన్‌) 
కుటుంబం: భార్య: సత్తి ఆదిలక్ష్మి, 
కుమారుడు డాక్టర్‌ సత్తి గౌతమ్‌రెడ్డి, (ఎంబీబీఎస్, ఎంఎస్,   ఎంసీహెచ్‌(యూరాలజీ)
వైద్య సేవలు:  తండ్రి సత్తి గంగిరెడ్డి పేరున 
15.11.1991న అనపర్తిలో గంగిరెడ్డి నర్సింగ్‌ హోమ్‌ ప్రారంభించారు. 21.06.1995లో నిర్మించిన సొంత భవనంలో 80 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు.
రాజకీయ నేపథ్యం: కాంగ్రెస్‌ కుటుంబానికి చెందిన సూర్యనారాయణరెడ్డి వైద్యుడిగా ప్రజలకు సేవలందిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నా పరోక్షంగా తన పినతండ్రి, జిల్లా పరిషత్‌ మాజీ ప్రతిపక్ష నాయకుడు సత్తి రామారెడ్డి, తన మేనమామ, మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డిల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొని తన వంతు తోడ్పాటును అందించారు. జగన్‌ కాంగ్రెస్‌ను వీడిన వెంటనే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి తన సతీమణి, అప్పటి అనపర్తి మండల పరిషత్‌ ప్రతిపక్ష నాయకురాలు సత్తి ఆదిలక్ష్మితో కలిసి కాంగ్రెస్‌ను వీడారు. అనంతరం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందారు.  ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతమైన పాత్రను పోషించారు.

పెద్దాపురం- తోట సరస్వతి (వాణి)


అభ్యర్థి: తోట సరస్వతి (వాణి)
వయస్సు: 48, విద్యార్హత : డిగ్రీ
తండ్రి: మెట్ల సత్యనారాయణ (మాజీ మంత్రి)
భర్త  : తోట నరసింహం ( మాజీ మంత్రి,  ఎంపీ)
రాజకీయనేపథ్యం : 2014లో వీరవరం  పంచాయతీ సర్పంచ్‌. తండ్రి మెట్ల  కోనసీమలో  సీనియర్‌ నాయకుడు. ఆమె భర్త నరసింహంకు 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి జగ్గంపేట ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చారు. 2009లో తిరిగి పోటీ చేసి విజయం సాధించి,  స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రిగా పని చేశారు.  కాంగ్రెస్‌ను వీడి టీడీపీ నుంచి కాకినాడ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని విస్మరించిన చంద్రబాబు తీరుతో టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరారు.      

రామచంద్రపురం - చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ


 అభ్యర్థి: చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
పుట్టిన తేదీ: 23.12.1962, విద్యార్హత : బీఏ
కుటుంబం : భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు–నరీన్, ఉమాశంకర్‌. చేపట్టిన పదవులు: 1999 నుంచి ఇప్పటివరకు ఏపీ బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, 2001 నుంచి 2006 వరకు రాజోలు నుంచి జెడ్పీటీసీ సభ్యుడు. 2006లో తిరిగి రాజోలు నుంచి జడ్పీటీసీగా గెలుపొంది జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.  2014 ఎన్నికల్లో కాకినాడ రూరల్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. 

కాకినాడ సిటీ - ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి


అభ్యర్థి: ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
తండ్రి : ద్వారంపూడి భాస్కరరెడ్డి
పుట్టిన తేదీ: 8.7.1967
విద్యార్హత: బీకాం
కుటుంబం: భార్య మహాలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు
రాజకీయ నేపథ్యం : 1988లో స్టేట్‌ యూత్‌ కాంగ్రెస్‌ జాయింట్‌ సెక్రటరీ, 2000–2009 పీసీసీ మెంబర్, 2000 నుంచి 2006 వరకూ కాకినాడ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, 2005లో హౌసింగ్‌ బోర్డు డైరెక్టర్, 2009 నుంచి 2014 వరకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే. ద్వారంపూడి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా మున్సిపల్‌ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నోట్‌పుస్తకాల పంపిణీ.

 కాకినాడ రూరల్‌ - కురసాల కన్నబాబు


 అభ్యర్థి: కురసాల కన్నబాబు
వయస్సు : 46
విద్యార్హత: బీకాం,  ఎంఏ
తల్లిదండ్రులు: సత్యనారాయణ, కృష్ణవేణి
కుటుంబం : భార్య  శ్రీవిద్య, కుమార్తె సిరి
రాజకీయ నేపథ్యం : ఈనాడు సంస్థలో సాధారణ జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి ప్రిన్సిపల్‌ కరస్పాండెంట్‌ స్థాయికి ఎదిగారు, 2009లో  మెగాస్టార్‌  చిరంజీవి  ఆశీస్సులతో కాకినాడ రూరల్‌ నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా  పోటీ చేసి గెలుపొందారు. 2014లో పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి మూడవ స్థానంలో నిలిచారు. అనంతరం వైఎస్సార్‌ సీపీలో చేరి కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా, కాకినాడ రూరల్‌ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.  

కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి 


అభ్యర్థి : చిర్ల జగ్గిరెడ్డి 
పుట్టిన తేదీ: 26.11.1970
విద్యార్హత : ఎంబీఏ
తల్లిదండ్రులు: రాధాదేవి, సోమసుందరరెడ్డి  
కుటుంబం: భార్య: లావణ్య, కుమారుడు సోమసుందరరెడ్డి, కుమార్తె శ్రీనిధిరెడ్డి
రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తాత చిర్ల జగ్గిరెడ్డి 1957కి ముందు గోపాలపురం సర్పంచ్‌గా, 1987లో కొత్తపేట పంచాయతీ సమితి  ప్రథమ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన వారసునిగా సోమసుందరరెడ్డి  రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తొలుత 1983లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్‌ నుంచి  ఎన్నికయ్యారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజా సేవలో గడిపారు. సోమసుందరరెడ్డి  వారసునిగా కుమారుడు జగ్గిరెడ్డి 2001లో రాజకీయ అరంగేట్రం చేసి  రావులపాలెం  జడ్పీటీసీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 2014  ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే విజయం సాధించారు.

పిఠాపురం - పెండెం దొరబాబు


అభ్యర్థి : పెండెం దొరబాబు
పుట్టినతేదీ : జనవరి 12, 1959 విద్యార్హత : డిగ్రీ
తల్లిదండ్రులు : వీరరాఘవరావు, వీరరాఘవమ్మ
కుటుంబం : భార్య అన్నపూర్ణ, కుమార్తె సత్యఅనంతలక్ష్మీదేవి (అర్షిత)
రాజకీయ నేపథ్యం: దొరబాబు తండ్రి పెద వీరరాఘవరావు కాకినాడ సర్పవరం సొసైటీ అధ్యక్షునిగా 25 ఏళ్లు పనిచేయగా సోదరుడు సుబ్బారావు 5 ఏళ్లు సొసైటీ అధ్యక్షునిగా పని చేశారు.  1999లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2004లో తిరిగి ఆ పార్టీ నుంచే  గెలుపొందారు. 2009లో వైఎస్‌  ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.  2014లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేశారు. 

మండపేట -  పిల్లి సుభాష్‌చంద్రబోస్

అభ్యర్థి: పిల్లి సుభాష్‌చంద్రబోస్‌
వయస్సు : 69 సంవత్సరాలు
విద్యార్హత : బీఎస్సీ
తల్లిదండ్రులు: ముత్యాలమ్మ, సూర్యనారాయణ
కుటుంబం : భార్య సత్యనారాయణమ్మ,  ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
రాజకీయ నేపథ్యం: రాయవరం మునసబు వుండవిల్లి సత్యనారాయణమూర్తిని రాజకీయ గురువుగా భావిస్తారు. జెడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ (1978), హసన్‌బాద సర్పంచ్‌ (1983).
ఎమ్మెల్యేగా మొట్టమొదట రామచంద్రపురం నుంచి 1985లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 2004లో ఇండిపెండెంట్‌గా, 2009లో తిరిగి కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ నుంచి రామచంద్రపురం నుంచి పోటీ చేశారు. 2006లో మంత్రి పదవి చేపట్టి 2009 ఫిబ్రవరి వరకు, తిరిగి 2009 మే నుంచి 2010 డిసెంబర్‌ వరకు మంత్రిగా ఉన్నారు. 

ముమ్మిడివరం - పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌


అభ్యర్థి : పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌
పుట్టిన తేదీ: 14.2.1973 విద్యార్హత: బీకాం
తల్లిదండ్రులు: సత్యారావు, రామానుజమ్మ,
కుటుంబం: భార్య నీరజ, కుమారులు సత్య సుమంత్, రేవంత్,
రాజకీయ నేపథ్యం:  2009లో దివగంత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేపి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల వైఎస్సార్‌ సీపీలో చేరి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.

జగ్గంపేట - జ్యోతుల నాగ వీర వెంకట విష్ణు సత్య మార్తాండరావు (చంటిబాబు)


అభ్యర్థి: జ్యోతుల నాగ వీర వెంకట విష్ణు సత్య మార్తాండరావు (చంటిబాబు)  

పుట్టిన తేదీ : 08.10.1978 విద్యార్హత : ఎంఏ (పాలిటిక్స్‌)
తల్లిదండ్రులు:  అన్నపూర్ణ, రామస్వామి
కుటుంబం: భార్య నాగసూర్యవేణి, కుమార్తె, కుమారుడు.
రాజకీయ నేపథ్యం : చంటిబాబు తండ్రి రామస్వామి సొసైటీ అధ్యక్షునిగా పని చేశారు. చంటిబాబు 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు.  ఏలేరు ప్రాజెక్టు చైర్మన్‌గా వ్యవహరించారు. 

పి.గన్నవరం - కొండేటి చిట్టిబాబు


 అభ్యర్థి : కొండేటి చిట్టిబాబు
పుట్టిన తేదీ : 1, ఏప్రిల్‌ 1963
విద్యార్హత : ఎంఏ
తండ్రి : నాగేశ్వరరావు
కుటుంబం: భార్య లక్ష్మి, కుమారులు వికాస్‌బాబు, స్టాలిన్‌బాబు, కుమార్తె దేవీప్రియాంక 
రాజకీయ నేపథ్యం: విద్యార్థి దశలో పలు సమస్యలపై  పోరాటం చేశారు. మొదట్లో కాంగ్రెస్‌లో ఉంటూ ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వైఎస్సార్‌ సీపీ  ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో  చురుగ్గా పాల్గొంటున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పి.గన్నవరం నుంచి పోటీ చేశారు.   

రంపచోడవరం - నాగులపల్లి ధనలక్ష్మి


 అభ్యర్థి: నాగులపల్లి ధనలక్ష్మి
తల్లిదండ్రులు: రాఘవ, వీరబ్బాయిదొర 
పుట్టిన తేదీ:  06.12.1984
విద్యార్హతలు: బిఏ(తెలుగు లిటరేచర్‌), బీఈడీ
నేపథ్యం:  2013 ఆగస్టులో రంపచోడవరం మండలం ఎర్రంపాలెంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా   చేరారు. 2018 జూన్‌లో  ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు.  వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌ పాదయాత్ర సాగించేటప్పుడు  రావుపాలెంలో పార్టీలో చేరారు. ధనలక్ష్మి తల్లి రాఘవ గొండోలు సర్పంచ్‌గా 2001 నుంచి 2006 వరకు, 2013 నుంచి 2018 వరకు పనిచేశారు. 

రాజోలు - బొంతు రాజేశ్వరరావు


అభ్యర్థి : బొంతు రాజేశ్వరరావు
పుట్టిన తేదీ: 28.6.1953
తల్లిదండ్రులు:   విక్టోరియమ్మ, ప్రభాకరరావు,
చదువు: ఎంటెక్‌ 
కుటుంబం: భార్య అరుణకుమారి
కుమార్తెలు: భార్గవి, ఈశ్వరి ప్రియాంక, కుమారుడు: సాయి వెంకట్‌
ఉద్యోగ, రాజకీయ నేపథ్యం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా రిటైరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 19,545 జనావాసాలకు తాగునీటి వసతి కల్పించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు పొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండి రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూప కల్పన చేశారు. స్వయం సహాయక గ్రూపుల నిర్మాణం, నిరుద్యోగులకు ఉపాధి తదితర అంశాలపై ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. అనంతరం జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున రాజోలు నుంచి పోటీ చేసి 4,808 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

తుని -  దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)


అభ్యర్థి :  దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)
పుట్టిన తేదీ : 19.07.1975
తల్లిదండ్రులు : సత్యనారాయణమ్మ, శంకర్రావు
విద్యార్హత  : బీఏ 
కుటుంబం : భార్య లక్ష్మీ చైతన్య, కుమారుడు శంకర్‌ మల్లిక్, కుమార్తె ఆశ్రిత
రాజకీయ నేపథ్యం: విద్యార్థి దశ నుంచే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. తుని నియోజకవర్గం నుంచి టికెట్‌ కోసం ప్రయత్నించారు. 2010లో వైఎస్సార్‌ సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున తుని అభ్యర్థిగా పోటీ చేసి యనమల రాకమకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడిపై విజయం సాధించారు

ప్రత్తిపాడు - పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌


అభ్యర్థి:  పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌
పుట్టిన తేదీ: 14–8–1964 
విద్యార్హత : ఇంటర్మీడియట్‌
కుటుంబం: భార్య సత్యవేణి, కుమార్తెలు నందిని, దీనా
రాజకీయ నేపథ్యం: 1989లో రాజకీయాల్లోకి వచ్చారు. శంఖవరం పంచాయతీ ఉపసర్పంచ్‌గా పని చేశారు. ఆంధ్రా బ్యాంక్‌ ఎఫ్‌ఏసీఎస్‌ అ««ధ్యక్షుడిగా, జెడ్పీటీసీ సభ్యుడిగా, అన్నవరం దేవస్థానం ట్రస్టు బోర్డు డైరెక్టర్‌గా, సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
 2014లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement