ఇష్టారాజ్యంగా అనుమతులిస్తున్న విద్యాశాఖ అధికారులు
పూర్తిగా కొరవడిన పర్యవేక్షణ
తనిఖీ చేయకనే అనుమతులు
{పయివేటు స్కూళ్లలో నిబంధనలకు పాతర
గుర్రంకొండలో 60 ఏళ్ల నాటి భవనానికి అనుమతి
శిథిలావస్థకు చేరిన పలు{పభుత్వ పాఠశాలల భవనాలు
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
జిల్లాలో పాఠశాలలు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. విద్యాశాఖ అధికారుల అవినీతికి తోడు, యాజమాన్యాల ధన దాహానికి.. అభంశుభం తెలియని చిన్నారులు బలైపోతున్నారు. డబ్బు ముడితే ఎంతటి దీనావస్థలో ఉన్న భవనానికైనా.. అధికారులు ఇష్టారాజ్యంగా అనుమతులిస్తున్నారు. ఫలితంగా పాఠశాలల్లో ప్రమాదాలు నిత్య కృత్యంగా మారుతున్నాయి. పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ ఇండియున్ పబ్లిక్ స్కూల్ పైక ప్పు కూలి ఓ చిన్నారి మృతి చెందిన దుర్ఘటనే ఇందుకు నిదర్శనం
తిరుపతి: జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం బడిపిల్లలకు శాపంగా మారుతోంది. శిథిల భవనాల్లో నిర్వహిస్తున్న ప్రయివేటు పాఠశాలలకు సైతం అధికారులు అనుమతులిస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుర్రంకొండలో బుధవారం వుధ్యాహ్నం శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలోని ఓ తరగతి గది పైకప్పు ఉన్నట్టుండి కూలిపోయి అప్ఫా అనే ఆరేళ్ల చిన్నారి దుర్మరణం పాలయ్యింది. మరో పది మంది పిల్లలు గాయపడ్డారు.
పుట్టగొడుగుల్లా ప్రయివేటు పాఠశాలలు
జిల్లాలో అనుమతులు లేని పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు జోగుతూ నిబంధనలకు పాతర వేసి అడ్డకోలుగా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. పక్కా భవనాలు లేకుండానే, పలు పాఠశాలలు అద్దె భవనాలు ఇరుకు గదుల్లో నడుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పైకప్పుతో పాటు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. క్షేత్రస్థాయిలో వెళ్లి పాఠశాలలను తనిఖీ చేయకుండానే, మామూళ్లు తీసుకొని అనుమతులు, రెన్యూవల్స్ చేస్తున్నారు. ఇందువల్లే గుర్రం కొండలోని ప్రైవేటు పాఠశాలలో చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోవటంతోపాటు,పలువురి చిన్నారులకు గాయాలయ్యాయి. జూన్‌లోనే ఈ పాఠశాలకు రెన్యూవల్ ఇచ్చారు. మండల విద్యాశాఖ అధికారి తనిఖీ చేసి ఉంటే శిథిలావస్థకు చేరిన 60 ఏళ్ల భవనానికి అనుమతులకు సిఫారసు చేసేవారు కాదు.
ప్రైవేటు పాఠశాలల అనుమతులకు నిబంధనలివే....
{పాథమిక పాఠశాలలకు అయితే కిలోమీటరు, యూపీ స్కూల్‌కైతే 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలలకు 5 కిలోమీటర్లలోపు పాఠశాలలు ఉంటే అనుమతి ఇవ్వ కూడదు.పక్కాభవనం, 3 ఎకరాల ఆట స్థలం ఉండాలి...పంచాయతీ రాజ్ శాఖ ఎస్‌ఈ భవనానికి సంబంధించి పరిశీలించి ఇచ్చి న సర్టిఫికెట్‌ను జతచేయాలి. ఫైర్ సర్టిఫికెట్ ఉండాలి. శబ్దకాలుష్యం ఉండకూడదు. 8 కిలోమీటర్లలోపే ప్రవేటు స్కూళ్ల బస్సులు నడపాలి.
నిబంధనలకు పాతర..
్రైపైవేటు పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు డబ్బులు తీసుకుని ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారు. దాదాపు50 శాతం పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయి. ఫైర్ పరికరాలు కొన్ని స్కూళ్లలో మచ్చుకైనా కనిపించవు. చాలా స్కూళ్లకు పక్కా భవనాలు లేవు. తాత్కాలికంగా రెకులషెడ్డుల్లో నడుపుతున్నారు. తిరుపతి ఉపవిద్యాశాఖ అధికారిగా ఉన్న శామ్యూల్ జిల్లా విద్యాశాఖ అధికారిగా, మదనపల్లె ఉప విద్యాశాఖ అధికారిగా త్రిపాత్రభినయం చేస్తున్నారు. దీంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. చిత్తూరు ఉపవిద్యాధికారే, పుత్తూరు ఉపవిద్యాశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 66 మంది మండల విద్యాశాఖ అధికారులకు గాను 9 మందే రెగ్యులర్ విద్యాశాఖ అధికారులు ఉండటం గమనార్హం.. మిగిలిన చోట్ల ఇన్‌చార్జి అధికారులతోనే నడిపిస్తున్నారు.
గుర్తింపు రద్దు, క్రిమినల్ కేసులు నమోదు
ఇటీవల కురిసిన వర్షాలకు భవనం మెత్తబడి ఒకటిన్న అడుగుల మేర కుప్పకూలింది. మూడు రోజుల క్రితమే పాఠవాల యజమాని నోటీసులు ఇచ్చాం. భవనం బాగా లేదని...పాఠశాలకు సెలవులైనా ఇవ్వాలని లేదా వేరే భవనంలోకి మార్చాలని చెప్పాం. యాజమాన్యం వినిపించుకోకుండా పాఠశాల నడిపినందుకు పాఠశాల గుర్తింపును రద్దు చేస్తున్నాం. అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. పాఠశాల రెన్యూవల్ విషయంలో మండల విద్యాశాఖ అధికారి తప్పుగా నివేదిక ఇచ్చివుంటే విచారించి చర్యలు తీసుకొంటాం.
-శామ్యూల్, జిల్లా విద్యాశాఖ అధికారి
కూలబడి
Published Thu, Nov 26 2015 2:19 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement