కాకినాడ రూరల్, న్యూస్‌లైన్:
‘మురిపాలు, మురుగుపాలు’ అనే శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు జిల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు స్పందించారు. కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశాల మేరకు రాజీవ్ విద్యామిషన్ జిల్లా ప్రాజెక్టు అధికారి వెన్నపు చక్రధరరావు పర్యవేక్షణలో అధికారులు చిన్నారుల ఆచూకీ తెలుసుకునేందుకు ఇంద్రపాలెం, కాకినాడ ప్రాం తాల్లో శుక్రవారం ఉదయం నుంచి పర్యటిం చారు. వారిలో ఓ బాలుడిని గుర్తించి పట్టుకున్నారు. అతడి తల్లి మేడిపాటి గౌరి, తండ్రి మహ్మద్ నజీర్ విజయవాడ నుంచి 15 ఏళ్ల క్రితం కాకినాడకు వచ్చారు. వీరు కాగితాలు ఏరుకొని, వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇలాఉండగా గౌరి కుటుంబం కాకినాడ పీఆర్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన చిన్న గుడిసెలో ఉంటున్నారని, వీరి చిన్న అబ్బాయి మహమ్మద్ పాఠక్‌గా గుర్తిం చి, బాలుడిని సూర్యారావుపేట మున్సిపల్ ఎలిమెం టరీ పాఠశాలలో జాయిన్ చేసినట్టు పీఓ చక్రధరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ చిన్నారి అన్నయ అన్నామణిని గత జూన్ నెలలో నాలుగో తరగతిలో చేర్చినట్టు చెప్పారు. ఇలాఉండగా మరొక బాలుడి కోసం ఉపాధ్యాయులు, అధికారులు ఇంద్రపాలెం పరి సర ప్రాంతాల్లో వెతుకుతున్నారని, గ్రామస్తుల సాయం కూడా తీసుకున్నట్టు చక్రధరరావు తెలిపారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ తాడి సుబ్బారావు ఆయన వెంట ఉన్నారు.
పాఠశాలకు ‘మురిపాలు..’
Published Sat, Mar 8 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement