'ఏపీకి హైకోర్టు వస్తే.. చంద్రబాబుకు బాధ ఏంటి?' | Ramachandraiah fires on Chandrababu over High court | Sakshi
Sakshi News home page

'ఏపీకి హైకోర్టు వస్తే.. చంద్రబాబుకు బాధ ఏంటి?'

Published Sat, Dec 29 2018 3:44 PM | Last Updated on Sat, Dec 29 2018 3:55 PM

Ramachandraiah fires on Chandrababu over High court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా హైకోర్టు ఏపీకి వచ్చింది, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బాధ ఎందుకు అని వైఎస్సార్‌సీసీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య మండిపడ్డారు. హైకోర్టు విభజన విషయంలో సుప్రీంకోర్టు తీర్పును, రాష్ట్రపతి ఉత్తర్వులను చంద్రబాబు వ్యతిరేకించడం ఏంటన్నారు. హైకోర్టు విభజన అయితే నడుస్తున్న కేసుల్లో న్యాయం ఏమైనా మారుతుందా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు బుర్రలోనే కుట్ర దాగిఉందని, మళ్లీ ఆయనే కుట్ర అనడం విడ్డూరంగా ఉందని నిప్పులుచెరిగారు.

వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యలయంలో రామచంద్రయ్య మాట్లాడుతూ.. 'ప్రత్యేక ప్యాకేజీ వస్తే తన వాళ్లకి ఫండ్స్ పంచి పెట్టొచ్చు అని చంద్రబాబు చూశారు. పర్యావరణ అనుమతులు లేకున్నా ముఖ్యమంత్రి భవనంలో నివాసముంటున్నారు. ఏ సౌకర్యాలు లేకుండా అధికారులను మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. బాబు మాత్రం నది ఒడ్డున మంచి భవంతిలో బతుకుతున్నారు. ప్రభుత్వ మీటింగుల కోసం విజయవాడ హోటల్స్‌లో కోట్లు ఖర్చు చేశారు. న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్న చంద్రబాబుపై సుమోటోగా కేసు పెట్టాలి. న్యాయ వ్యవస్థలే కుట్ర పన్నుతున్నాయని బాబు అంటున్నారు. చట్టసభలను, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారు. బాబుపై సుమోటోగా కేసు వేసి విచారణ జరపాలి.

రాత్రికి రాత్రి బాబు సెక్రటేరియట్ తరలిస్తే తప్పు కాదు. కానీ, కోర్టును తరలించాలంటే తప్పా? ఏపీకి హైకోర్టు రావాలన్న పేపర్లు, వ్యక్తులు ఇప్పుడు మాట మార్చాయి. బాబు తన కోసం వ్యవస్థలను వాడుకుంటున్నారు. కోర్టులు ఏపీకి వస్తే వైఎస్‌ జగన్ కేసులు మొదటికొస్తాయి అని బాబు అనడం దారుణం. న్యాయ వ్యవస్థకే రాజకీయాలు అంటగడుతున్నారు. మనం డిమాండ్ చేసుకున్న కోర్టును, వారు ఇస్తే.. బాబు దీన్ని కుట్ర అంటారు. డిసెంబర్ 15 లోగా కోర్టులకు భవంతులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చారు' అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement