
రేషన్ డీలర్లను తొలగించాలనుకోవడం అమానుషం
పులివెందుల : చిన్న, చిన్న తప్పులను సాకుగా చూపి రేషన్ డీలర్ షిప్‌లను రద్దు చేసే విధంగా అధికారులపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి కొంతమంది తెచ్చారు. మంగళవారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సింహాద్రిపురం మండలంలోని వై.కొత్తపల్లె, పైడిపాలెం, ఇడుపులపాయకు చెందిన రేషన్ డీలర్లు కలిశారు. ఇందుకు స్పందించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి రేషన్ డీలర్ల విషయంలో ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా న్యాయబద్దంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. కొంతమంది నిరుద్యోగులు తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరగా.. వారికి లేఖల ద్వారా, ఫోన్ల ద్వారా సిఫార్పు చేశారు. ఇంకా కొంతమంది ప్రజలు తమ సమస్యలను ఎంపీ దృష్టికితేగా.. వాటి పరిష్కారానికి ఆయా అధికారులకు ఫోన్లు చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వేల్పుల రామలింగారెడ్డి, కసనూరు పరమేశ్వరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.