
రాయలతెలంగాణ ఒక క్రిమినల్ ప్రతిపాదన:నారాయణ
హైదరాబాద్: రాయలతెలంగాణ అనేది ఒక క్రిమినల్ ప్రతిపాదన అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఇప్పటి వరకు తెలంగాణవాదులు ప్రత్యేక తెలంగాణ కోరుతున్న నేపధ్యంలో కొత్తగా తెరపైకి వచ్చిన రాయలతెలంగాణ ప్రతిపాదన పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిమాయత్ నగర్ వై జంక్షన్‌లో సీపీఐ కార్యక్తలు ఆందోళన చేస్తున్నారు. రాయలతెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ జిఓఎం శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రజలను నిరాశలోకి నెట్టడానికే రాయలతెలంగాణ ఆలోచన చేస్తున్నారన్నారు.