Rayalatelangana
-
అందుకే రాయలతెలంగాణ డిమాండ్:జేసీ
అనంతపురం: కృష్ణా జలాలు సముద్రంలో కలిసినా పర్వాలేదని, రాయలసీమకు వెళ్లకుండా ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కేసీఆర్) పని చేస్తున్నారని ఎంపీ జేసీ దివాకర రెడ్డి విమర్శించారు. నీటి వివాదాలు వస్తాయని తెలిసే, తాము రాయల తెలంగాణ డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. శ్రీశైలం జలవివాదంపై కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని జేసీ డిమాండ్ చేశారు. ** -
'రాయలసీమను విభజించి కాశ్మీర్‌లా మారుస్తారా'
కాంగ్రెస్ పార్టీపై నరసరావుపేట ఎంపీ ఎం.వేణుగోపాలరెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన అంటూ ఆంధ్రప్రదేశ్‌ను రావణకాష్టంగా మార్చి... ఇరు ప్రాంతాల ప్రజల మధ్య తగవులు పెట్టారంటు ఎం.వేణుగోపాలరెడ్డి ధ్వజమెత్తారు. నాలుగు జిల్లాతో ఉన్న రాయలసీమను విభజించి కాశ్మీర్లాగా మారుస్తారా అని ఆ పార్టీని ప్రశ్నించారు. ఎవరు అడిగారని రాయలసీమను విభజిస్తున్నారంటూ ఆయన ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణ కలుపుతు రాయలతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకు వచ్చింది. దీనిపై అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర నేతలు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
రాయలతెలంగాణ ఒక క్రిమినల్ ప్రతిపాదన:నారాయణ
హైదరాబాద్: రాయలతెలంగాణ అనేది ఒక క్రిమినల్ ప్రతిపాదన అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఇప్పటి వరకు తెలంగాణవాదులు ప్రత్యేక తెలంగాణ కోరుతున్న నేపధ్యంలో కొత్తగా తెరపైకి వచ్చిన రాయలతెలంగాణ ప్రతిపాదన పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాయత్ నగర్ వై జంక్షన్లో సీపీఐ కార్యక్తలు ఆందోళన చేస్తున్నారు. రాయలతెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ జిఓఎం శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రజలను నిరాశలోకి నెట్టడానికే రాయలతెలంగాణ ఆలోచన చేస్తున్నారన్నారు. -
పార్లమెంట్లో గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా
రాయలతెలంగాణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు గురువారం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలోపాటు10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా టీఆర్ఎస్ ఎంపీలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు వివేక్, మందా జగన్నాథం, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు ఆ ధర్నాలో పాల్గొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. ఆ సమావేశాలు 12 రోజులపాటు జరగనున్నాయి. -
'రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు'
తాగునీరు,సాగునీరు కోసమే రాయలతెలంగాణ అని గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అలా కాని పక్షంలో రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించారు. అలా చేయకుంటే అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరని ఆయన పేర్కొన్నారు. నీళ్ల కోసం రెండు జిల్లాలను కర్ణాటకలో కలపిన తమకు అభ్యంతరం లేదని తెలిపారు. రెండో ఎస్సార్సీ వేసి, ఆ తర్వాతే రాష్ట్ర విభజన చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.రాజకీయ ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాయలతెలంగాణను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. -
రాయల తెలంగాణపై కేసిఆర్ తో కాంగ్రెస్ నేతల దౌత్యం
-
రాయలతెలంగాణపై కేసిఆర్‌తో కాంగ్రెస్ నేతల దౌత్యం
రాష్ట్ర విభజన ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. అయితే ఇప్పుడు రాయలతెలంగాణ ప్రతిపాదనను కాంగ్రెస్ నేతలు మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుతో దౌత్యం జరుపుతున్నారు. రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తలెత్తే ఇబ్బందులపై కెసిఆర్‌తో వారు చర్చిస్తున్నారు. అయితే ఈ అంశం జోలికి వెళ్లవద్దని కెసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రయోజనాలు నెరవేరవని కెసిఆర్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ జేఏసీ నాయకులు మాత్రం 10 జిల్లాల తెలంగాణను మాత్రమే కోరుకుంటున్నారు. రాయల తెలంగాణను ఇరుప్రాంతాలవారు ఒప్పుకోరు అని వారు చెబుతున్నారు. రాయల తెలంగాణ ఇవ్వడం ద్వారా రెండు ప్రాంతాలకు ఎలాంటి లాభం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. 10 జిల్లాల తెలంగాణ కోసం మద్దతు ఇవ్వాలని వారు ఢిల్లీలో అన్ని పార్టీల నేతలను కలువనున్నారు. ఇదిలా ఉండగా, సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు మాత్రం ఢిల్లీలో మౌనం దాల్చారు. రాయలతెలంగాణ విషయమై వారు ఏమీ మాట్లాడటంలేదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా వారు అంగీకరించే విధంగా ఉన్నారు. వారు వ్యతిరేకించే పరిస్థితి కనిపించడంలేదు. రాయలతెలంగాణ ప్రతిపానను బిజెకి అంగీకరించదు. కెసిఆర్ ససేమిరా అంటున్నారు. ఈ పరిస్థితులలో మరోసారి ఆలోచించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిష్టానికి చెబుతున్నట్లు తెలుస్తోంది.