'రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు' | kcr opposes Rayalatelangana due to political benefits,says Madhusudan Gupta | Sakshi
Sakshi News home page

'రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు'

Published Wed, Dec 4 2013 2:47 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

kcr opposes Rayalatelangana due to political benefits,says Madhusudan Gupta

తాగునీరు,సాగునీరు కోసమే రాయలతెలంగాణ అని గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్గుప్తా అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అలా కాని పక్షంలో రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించారు. అలా చేయకుంటే అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరని ఆయన పేర్కొన్నారు.

 

నీళ్ల కోసం రెండు జిల్లాలను కర్ణాటకలో కలపిన తమకు అభ్యంతరం లేదని తెలిపారు. రెండో ఎస్సార్సీ వేసి, ఆ తర్వాతే రాష్ట్ర విభజన చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.రాజకీయ ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాయలతెలంగాణను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement