Madhusudan Gupta
-
జనసేన నేత బైండోవర్
సాక్షి, అనంతపురం: జనసేన పార్టీ నాయకుడు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన గుప్తాను బైండోవర్ చేశారు. 21, 23న జరిగే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ముందస్తు చర్యల్లో భాగంగా గుంతకల్లు మధుసూదన్ గుప్తాని శుక్రవారం పోలీసులు బైండోవర్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గుత్తి పట్టణం కర్నూలు రోడ్డులోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగులగొట్టారు. అప్పడు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు గుత్తి పోలీసులు పాత కేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ని బైండోవర్ చేశారు. రూ.లక్ష సొంత పూచికత్తు తీసుకుని తహసీల్దార్ బ్రహ్మయ్య ఎదుట బైండోవర్ చేశారు. (చదవండి: ఇది ఫెవికాల్ బంధం) కాగా, గత ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, ఆయన కుమారుడిని ఉద్దేశించి మధుసూదన గుప్తా తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘మర్డర్లు చేయడం నాకు కొత్తకాదు, గతంలో టీడీపీ వారి ఆస్తులు, ఆడవాళ్ల జోలికి వచ్చానంటే అది రాజకీయంలో భాగమేన’ని వ్యాఖ్యానించి కలకలం రేపారు. (వెంటాడి కత్తులతో నరికిన జనసేన కార్యకర్తలు) పలువురి నామినేషన్ల తిరస్కరణ జెడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ)లో రెండేసి సెట్లు వేసిన అభ్యర్థులకు సంబంధించి ఒక సెట్టును తిరస్కరించారు. అలాగే వివిధ కారణాల వల్ల మరో 8 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. 1995 తర్వాత మూడో సంతానం కల్గిన కారణంగా కదిరి ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం.కమలాబాయి నామినేషన్‌ను, కుల ధ్రువీకరణ పత్రం జత చేయని కారణంగా విడపనకల్లు వైఎస్సార్సీపీ తరుఫున దాఖలు చేసిన మేకల పంపాపతి నామినేషన్‌ను, డిక్లరేషన్‌లో అభ్యర్థి సంతకం చేయని కారణంగా అగళి బీజేపీ అభ్యర్థి ఇ.చిక్కప్ప నామినేషన్‌ను, అనంతపురం నగరంలో ఓటరుగా నమోదైన కారణంగా గోరంట్ల బీజేపీ అభ్యర్థి కె.భాస్కర్ నాయక్ నామినేషన్‌ను తిరస్కరించారు. కాగా, తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబంధించి తనకల్లు అభ్యర్థి వై. ఈశ్వరమ్మ, రొళ్ల అభ్యర్థి ఎస్.గౌడప్ప, పరిగి అభ్యర్థి కె.లక్ష్మీదేవమ్మ శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి వద్ద అప్పీలు చేసుకున్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నామినేషన్ల అంకం తుదిదశకు చేరుకుంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. కాగా గురువారం రాత్రి 428 మంది నామినేషన్లు ఆమోదం పొందినట్లు తెలిపిన జెడ్పీ అధికారులు శుక్రవారం ఉదయానికి 409 నామినేషన్లను ధ్రువీకరించారు. ఇందులో 9 బీఎస్పీ, 40 బీజేపీ, సీపీఐ 5, సీపీఎం 7, కాంగ్రెస్ 33, వైఎస్సార్సీపీ 138, టీడీపీ 132, జనసేన 16, ఇండిపెండెంట్లు 29 నామినేషన్లు ఉన్నాయి. -
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి విధ్వంసం
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌లో అధికార టీడీపీతో పాటు జనసేన పార్టీ నాయకులు పెట్రేగిపోతున్నారు. పలుచోట్ల దౌర్జన్యాలు, దాడులకు దిగుతూ ప్రజలు, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. (చదవండి: మర్డర్లు నాకు కొత్తకాదు) అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో గుత్తి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల 183వ నంబర్ పోలింగ్ బూత్‌లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మదుసూదన్ గుప్తా విధ్వంసానికి పాల్పడ్డారు. పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేవంటూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ను ధ్వంసం చేశారు. ఓటింగ్ ఛాంబర్లో శాసనసభ, లోక్‌సభ అనే పేర్లు సరిగా రాయలేదని పోలింగ్ సిబ్బందితో గొడవకు దిగారు. ఆగ్రహంతో ఊడిపోతూ ఈవీఎంను నేలకేసి కొట్టారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, ఈవీఎంను ధ్వంసం చేసినందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి విధ్వంసానానికి దిగితే ఎల్లో మీడియా మాత్రం వైఎస్సార్సీపీ కార్యకర్త ఈవీఎం ధ్వంసం చేశారని రిపోర్ట్ చేయడం శోచనీయం. -
మర్డర్లు నాకు కొత్తకాదు..
అనంతపురం, గుంతకల్లు: ‘‘నన్ను భయపెట్టాలని కొందరు ప్రయత్నించారు. అలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు. ఫ్యాక్షన్, మర్డర్లు వాళ్లకు కొత్తేమో.. మాకు కాదు. మాది 70 ఏళ్ల నుంచి ఫ్యాక్షన్ కుటుంబం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా అన్నారు. ఇటీవలే టీడీపీలో చేరిన ఆయన తొలిసారి సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘‘ఎవరినడిగి లోపలికి వచ్చావ్.. గో బ్యాక్ గుప్తా’’ అంటూ జితేంద్రగౌడ్ అనుచరులు నినదించారు. సంఘ విద్రోహ శక్తి నీవంటూ దూషించారు. ఒక దశలో గుప్తాపైకి దూసుకువెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాను ఎవరికీ బెదిరేది లేదని, దేనికైనా రెడీ అంటూ గుప్తా సవాల్ విసిరారు. తాను గ్రూపులు నడిపేందుకు టీడీపీలోకి రాలేదన్నారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు అనేక గ్రూపులను ఏకం చేసి గెలిచానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టి ఉండవచ్చనీ, అయితే అదంతా రాజకీయంలో భాగమేనన్నారు. ‘‘మీ ఆస్తులు, ఆడవాళ్ల జోలికి వచ్చానంటే.. అది దురుద్దేశంతో కాదని, మరొకరికి రాజకీయంగా న్యాయం చేసేందుకే’’ అని గుర్తుంచుకోవాలన్నారు. -
తమ్ముళ్ల తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: టీడీపీలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పీడ్‌కు బ్రేక్ పడింది. పార్లమెంట్ పరిధిలో ఎవరినీ సంప్రదించకుండా ఒంటెత్తు పోకడలతో నిర్ణయం తీసుకుంటున్నఆయనపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తాను పార్టీలో చేర్చుకుంటే టీడీపీలో కొనసాగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అనంతపురం పార్లమెంట్‌ను జేసీ దివాకర్‌రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని, ఆయన మాటలను పరిగణనలోకి తీసుకుంటే పార్టీ గంగలో కలవడం ఖాయమని తమ వాణి గట్టిగా వినిపించారు. దీంతో మధుసూదన్‌గుప్తా చేరిక వాయిదా పడింది.‘అనంత’ పార్లమెంట్ పరిధిలో తన ‘టీం’ను ఏర్పాటు చేసుకునే క్రమంలో భాగంగా గురునాథ్‌రెడ్డి చేరికతో తొలి పావు కదిపిన జేసీ, గుంతకల్లులో మధుసూదన్‌గుప్తాను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. మహానాడు వేదికపైనే గుప్తాను పార్టీలోకి చేర్చుకునేలా ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు తెలు స్తోంది. సోమవారం సాయంత్రం గుప్తా పార్టీలో చేరాల్సి ఉంది. తన నియోజకవర్గ నేత చేరికపై తనకు మాటమాత్రం కూడా సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడాన్ని ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు. తనకు తెలియకుండా చేరిక కు సిద్ధమయ్యారంటే, తనకు టిక్కెట్టు రాదని జరుగుతున్న ప్రచారం నిజమేనని ఆయన నిర్ధారణకు వచ్చారు. ‘అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు’ అన్నట్లు ఎలాగూ టిక్కెట్ల కేటాయింపుల్లో లొల్లి తప్పదు.. అదేదో ఇప్పుడే తేల్చుకుంటే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిదీ ఇదే పరిస్థితి. దీంతో ఇద్దరూ ఏకమాయ్యరు. వీరిద్దరూ మంత్రి కాలవ శ్రీనివాసులను కలిసి విషయం చెప్పినట్లు తెలుస్తోంది. రాయదుర్గంలో తనకూ పొగబెట్టి, అల్లుడిని తెచ్చుకోవాలని జేసీ చూస్తున్నారని.. మంత్రిని కాబట్టి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయానని కాలవ చెప్పినట్లు చర్చ జరుగుతోంది. వీరిద్దరి ఆవేశాన్ని కాలవ అస్త్రంగా చేసుకుని చంద్రబాబు రాజకీ య సలహాదారు, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌కు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారు జనార్దన్‌ను కలిశారు. గుప్తాను పార్టీలో చేర్చుకుంటే మహానాడు వేదిక నుంచి వెళ్లిపోతామని, పార్టీలో కొనసాగే విషయంలో కూడా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మనసులో మాటను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంతో జనార్దన్.. కాసేపు ఆగండని వెంటనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. జేసీపై ఫిర్యాదు.. పార్లమెంట్ పరిస్థితిపై నివేదిక కోరిన చంద్రబాబు ప్రభాకర్‌చౌదరి, జితేంద్రగౌడ్లు జనార్దన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత శింగనమల, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు కూడా జనార్దన్‌ను కలిసినట్లు తెలిసింది. దివాకర్‌రెడ్డి తీరుతో పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేంతా ఇబ్బంది పడుతున్నారని, ఆయన చర్యలు పార్టీకి నష్టం వాటిల్లేలా ఉన్నాయని, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా జనార్దన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్యేంతా జేసీపై ఫిర్యాదు చేయడంతో ముఖ్యమంత్రి మెట్టు దిగినట్లు తెలిసింది. అసలు ‘అనంత’ పార్లమెంట్ పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? వారి పని తీరు? ఎంపీ పనితీరు? ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం, ప్రజల అభిప్రాయంతో పాటు పూర్తి నివేదిక తనకు ఇవ్వాలని జనార్దన్‌కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో నివేదిక వచ్చే వరకూ గుప్తా చేరిక ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని టీడీపీ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నివేదికను బట్టి అనంతపురం ఎంపీ స్థానం నుంచి దివాకర్‌రెడ్డిని తప్పించి, వారి కుటుంబానికి తాడిపత్రి టిక్కెట్టు మాత్రమే కేటాయించే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దివాకర్‌రెడ్డికి ప్రస్తుతం టీడీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఎంపీపై ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ బీసీ నేతను పార్లమెంట్ బరిలో నిలపాలనే యోచనలో ఉంది. ఇంకోవైపు దివాకర్‌రెడ్డి ఇంట్లో రెండు టిక్కెట్లు ఇచ్చారు కాబట్టి, పరిటాల శ్రీరాంకు హిందూపురం ఎంపీ టిక్కెట్టు ఇవ్వాలని సునీత గట్టిగా అడుగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రిపోర్ట్ ఏమాత్రం తేడాగా ఉన్నా జేసీ బ్రదర్స్ రాజకీయం తిరిగి తాడిపత్రికే పరిమితం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహానాడులోరచ్చ ఎందుకనే వాయిదా విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్న చంద్రబాబు గుప్తాను చేర్చుకుంటే చౌదరి, గౌడ్ అన్నంత పని చేస్తారేమోనని.. అదే జరిగితే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు పూర్తిగా దారి తప్పి మీడియా దృష్టి, రాజకీయ పార్టీల చర్చ ఎమ్మెల్యేల ధిక్కార స్వరంపైనే ఉంటుందని భావించినట్లు సమాచారం. దీంతోనే చేరికను వాయిదా వేసినట్లు తెలిసింది. దీనిపై దివాకర్‌రెడ్డి ఓ సీనియర్ నేతను ఆరా తీయగా.. ‘మహానాడులో చేరికలు ఉండవని, తర్వాత చుద్దాం’ అని మొదట చెప్పగా.. ‘సీఎం క్యాంపు ఆఫీసులో చేరిక కార్యక్రమం నిర్వహిద్దాం’ అని జేసీ సలహా ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత సదరు సీనియర్ నేత ‘ఇప్పుడు వద్దులేండి, మహానాడు తర్వాత పెట్టుకుందాం’ అని బాబు చెప్పినట్లు సర్దుబాటు చేశారని విశ్వసనీయంగా తెలిసింది. -
మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా సంఘీభావం
ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం: ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌గుప్తా సంఘీభావం తెలిపారు. పాదయాత్రగా సోమవారం గుత్తికి వచ్చిన జగన్ గుత్తి ఆర్ఎస్లోని కొట్రికె స్వగృహం వద్దకు రాగానే మధుసూదన్‌తో పాటు ఆయన సోదరుడు శ్రీహరిగుప్తా తమ అనుచరులతో కలిసి జగన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం మధుసూదన్ విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌తో తన తండ్రి పద్మనాభయ్యశెట్టికి మంచి సంబంధాలుండేవని, తాను కూడా వైఎస్సార్ చలువ వల్లే ఎమ్మెల్యేగా గెలిచినట్లు తెలిపారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా జగన్‌తో కలిసి పనిచేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలకు అతీతంగానే జగన్‌ను కలిశానని, తన రాజకీయ భవిష్యత్తును మార్చిలో ప్రకటిస్తానని వివరించారు. -
'రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు'
తాగునీరు,సాగునీరు కోసమే రాయలతెలంగాణ అని గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అలా కాని పక్షంలో రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించారు. అలా చేయకుంటే అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరని ఆయన పేర్కొన్నారు. నీళ్ల కోసం రెండు జిల్లాలను కర్ణాటకలో కలపిన తమకు అభ్యంతరం లేదని తెలిపారు. రెండో ఎస్సార్సీ వేసి, ఆ తర్వాతే రాష్ట్ర విభజన చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.రాజకీయ ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాయలతెలంగాణను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. -
గుంతకల్ ఎమ్యెల్యేకు సమైక్య సెగ
రాష్ట విభజన అనివార్యమని గుంతకల్ ఎమ్మెల్యే మదుసూదన్ గుప్తా స్పష్టం చేశారు. అందుకే రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు వెల్లడించారు. అనంతపురంలోని ఎస్కేయూనివర్శిటీకి వచ్చిన గుప్తాను ఆ యూనివర్శిటీ జేఏసీ అడ్డుకుంది. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని జేఏసీ గుప్తాను నిలదీసింది. ఆ క్రమంలో ఆయన వాహనాన్ని జేఏసీ వ్యిద్యార్థులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్దులను చెదరగొట్టేందుకు యత్నించారు. దాంతో గుప్తా విద్యార్థుల వద్దకు వెళ్లి రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో రాయల తెలంగాణ ఏర్పాటు చేసే దిశగా తాము చేసే ప్రయత్నాలను వివరించారు. -
'విభజన అనివార్యం అందుకే రాయల తెలంగాణ'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమైనదని గుత్తి ఎమ్మెల్యే మధుసూధన్ గుప్తా సష్టం చేశారు. అందుకే రాయల్ తెలంగాణ ప్రతిపాదన తీసుకువచ్చామని ఆయన తెలిపారు. ఇంకా సమైక్యం అంటూ ఉంటే మనమే నష్టపోతామని మధుసూధన్ గుప్తా వ్యాఖ్యానించారు. శుక్రవారం అనంతపురం వచ్చిన మధుసూధన గుప్తాను బీసీ సంఘాలు అడ్డుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్రలోని ఉవ్వెత్తున్న ఎగసిన సమైక్య ఉద్యమాన్ని నీరుగారస్తున్నారంటూ ఆయా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో మధుసూధన గుప్తా పైవిధంగా స్పందించారు.