అనంతపురం, గుంతకల్లు: ‘‘నన్ను భయపెట్టాలని కొందరు ప్రయత్నించారు. అలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు. ఫ్యాక్షన్, మర్డర్లు వాళ్లకు కొత్తేమో.. మాకు కాదు. మాది 70 ఏళ్ల నుంచి ఫ్యాక్షన్ కుటుంబం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా అన్నారు. ఇటీవలే టీడీపీలో చేరిన ఆయన తొలిసారి సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ‘‘ఎవరినడిగి లోపలికి వచ్చావ్.. గో బ్యాక్ గుప్తా’’ అంటూ జితేంద్రగౌడ్ అనుచరులు నినదించారు. సంఘ విద్రోహ శక్తి నీవంటూ దూషించారు. ఒక దశలో గుప్తాపైకి దూసుకువెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాను ఎవరికీ బెదిరేది లేదని, దేనికైనా రెడీ అంటూ గుప్తా సవాల్ విసిరారు. తాను గ్రూపులు నడిపేందుకు టీడీపీలోకి రాలేదన్నారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు అనేక గ్రూపులను ఏకం చేసి గెలిచానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టి ఉండవచ్చనీ, అయితే అదంతా రాజకీయంలో భాగమేనన్నారు. ‘‘మీ ఆస్తులు, ఆడవాళ్ల జోలికి వచ్చానంటే.. అది దురుద్దేశంతో కాదని, మరొకరికి రాజకీయంగా న్యాయం చేసేందుకే’’ అని గుర్తుంచుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment